జైలర్ వసూళ్లలో కన్ఫ్యూజన్.. సన్ పిక్చర్స్ పై ఫ్యాన్స్ గుస్సా

'టైగర్ కా హుకుమ్'.. అంటూ బాక్సాఫీస్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-18 06:03 GMT

'టైగర్ కా హుకుమ్'.. అంటూ బాక్సాఫీస్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన కొత్త చిత్రం 'జైలర్' వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనం సృష్టిస్తోంది. మొదటి వారంలోనే ఎవరూ ఊహించని రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే ఇప్పుడీ వసూళ్ల లెక్కల వివరాల్లో గందరగోళం వస్తోంది. దీంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలం నుంచి రజనీ కాంత్ కు.. ఆయన స్టార్ స్టేటస్ కు తగ్గ సరైన హిట్ దక్కలేదు. కమర్షియల్ హిట్ అయినా కథ పరంగా ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'టైగర్ కా హుకుమ్' అంటూ 'జైలర్'గా అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ చిత్రం మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కామన్ ఆడియెన్స్ తో పాటు రజనీ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సినిమా అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ చిత్ర రివ్యూలు, వసూళ్లే ట్రెండ్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమచారాం ప్రకారం... ఈ చిత్రం మొదటి వారంలో నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు కథనాలు కూడా వచ్చాయి.

కానీ కట్ చేస్తే 'జైలర్' నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఓ చిన్న షాక్ ఇచ్చింది. మూడు వందల డెబ్భై ఐదు కోట్లే వచ్చినట్లు ఓ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా నిర్మాణ సంస్థలు లేని నెంబర్లు సృష్టించి మరీ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తుంటారని అంటుంటారు. కానీ జైలర్ కు మాత్రం రివర్స్ జరిగింది.

ట్రేడ్ వర్గాల అంచనాల నెంబర్ కన్నా నిర్మాణ సంస్థ ది తక్కువ ఉంది. పైగా ఓ పోస్టర్ లో నెంబర్ ఫిగర్ కింద బ్రాకెట్ లో టెంటెటివ్ అని రాసుకొచ్చారు. దీంతో రజనీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెంటెటివ్ అని వేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. స్పష్టంగా తెలుసుకుని వేయకుండా ఎందుకీ తొందరపాటని అడుగుతున్నారు. విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ లైఫ్ టైం వసూళ్లను కేవలం రెండు వారాల లోన్నే బ్రేక్ చేసే అవకాశం వచ్చినప్పుడు.. దాన్ని హైలైట్ చేయాల్సింది పోయి.. భిన్నంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా అయోమయం సృష్టించడం సరికాదని చెబుతున్నారు.

Tags:    

Similar News