ఓజీ ఓవర్సీస్ డీల్.. నిజమయ్యే ఛాన్సే లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలకు అక్కడ కూడా బిజినెస్ బాగానే జరుగుతుంది, అలానే మంచి వసూళ్లు వస్తాయి. అయితే ఇప్పుడు ఓజీ ఓవర్సీస్ రైట్స్ ధరకు సంబంధించి కొన్ని నెంబర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందులో నిజం లేదని అనిపిస్తోంది.
వివరాళ్లకి వెళ్లితే... పవన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'ఓజీ'('ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'). ముంబయి మాఫియాను ఎదిరించి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథతో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ 'ఓజీ'కు సంబంధించి హంగ్రీ చీత పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్ కు విశేష స్పందన దక్కింది.
ఇది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. మిగతా జనరల్ ఆడియెన్స్ కు కూడా ఆకట్టుకుంది. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.ముఖ్యంగా ఈ హంగ్రీ చీతాకు తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచింది. 'నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. శత్రువును ఎంచితే మొదలు వేట..చూపు కానీ విసిరితే ఓర కంట..డెత్ కోటా.. కన్ఫర్మ్ అంట..' వచ్చే లిరిక్స్ కు ఆయన కొట్టిన బీట్ గూస్ బంప్స్ తెప్పించింది.
అయితే ఇప్పుడీ సినిమా బిజినెస్ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ డీల్ ఫిక్స్ అయిందని అంటున్నారు. మొదట చర్చల్లో భాగంగా నిర్మాత డీవీవీ దానయ్య రూ.20 కోట్ల రూపాయలకు కోట్ చేశారని, కానీ ఆ తర్వాత చర్చల అనంతరం ఫార్స్ ఫిలిమ్స్ రూ. 13 కోట్లకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఇందులో నిజం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది వరకే.. ఎలాంటి గ్లింప్స్ రిలీజ్ కాకముందే.. ఈ చిత్రానికి రూ.18 కోట్ల ఆఫర్ యూఎస్ నుంచి వచ్చింద టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా కేవలం రూ.13 కోట్లు మాత్రమే అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎలాంటి గ్లింప్స్ రిలీజ్ చేయని సమయంలోనే రూ.18 కోట్ల ఆఫర్.. ఈ సినిమాకు వచ్చినప్పుడు.. ఇప్పుడు గ్లింప్స్ తో మరింత హైప్ పెరిగాక అంతకన్నా ఎక్కువ ధర పలికే అవకాశముంటుంది కానీ తక్కువ అవ్వదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ రూమర్స్ లో కూడా ఎలాంటి నిజం ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ పవన్ నుంచి రానున్న స్ట్రైట్ సినిమా కనుక బిజినెస్ ఈజీగా 2 మిలియన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.
కాగా ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. అంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను నిర్మించారు. 'సాహో' తర్వాత సుజీత్.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఇదే.