బాక్సాఫీస్: ఫస్ట్ వీకెండ్ టాప్ రికార్డులలో మన సినిమాలే.. నెక్స్ట్ వార్ 2?
ఇది తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్‌ను ఎంతలా పెంచిందో తెలియజేస్తోంది.;
భారతీయ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నది ఎవరు? అనే ప్రశ్నకు టాలీవుడ్ తరఫున గట్టిగా సమాధానం ఇస్తున్నాయి బాక్సాఫీస్ రికార్డులు. ఇండియన్ సినిమాల ఫస్ట్ వీకెండ్ (మూడు రోజులు) కలెక్షన్ల లిస్టును పరిశీలిస్తే, దాదాపు టాప్ ప్లేస్‌లన్నీ టాలీవుడ్ చిత్రాలే. పుష్ప 2: ది రూల్ మరోసారి ఇండస్ట్రీ రేంజ్ రికార్డులను తిరగరాస్తూ తొలి మూడు రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్‌ని దాటేసింది. ఈ లిస్టులో మరిన్ని టాలీవుడ్ మేటి చిత్రాలు కూడా కనిపిస్తాయి. ఇది తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్‌ను ఎంతలా పెంచిందో తెలియజేస్తోంది.
అప్పటివరకు టాలీవుడ్ పేరు వినిపించని బాలీవుడ్ డామినేటింగ్ బాక్సాఫీస్‌ను మొత్తం షేక్ చేసినది బాహుబలి 2 సినిమానే. రాజమౌళి మాస్టర్‌పీస్‌గా నిలిచిన ఈ సినిమా, ఓపెనింగ్ వీకెండ్‌లోనే 540 కోట్ల గ్రాస్‌ను అందుకుని అప్పటి వరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన RRR కూడా దాదాపుగా అదే తరహా సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా గుర్తింపు పొందింది.
నేడు తెలుగు సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో ఈ రికార్డులు బలంగా చెబుతున్నాయి. ఈ లిస్టులో కేవలం ఒక్క బాలీవుడ్ సినిమా మాత్రమే ఉంది, అది జవాన్. షారుక్ ఖాన్ స్టారర్ ఈ మూవీ 384 కోట్ల గ్రాస్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అతి కూడా సౌత్ డైరెక్టర్ అట్లీ తో వచ్చిన సినిమా. గత 7 ఏళ్ళలో బాలీవుడ్‌లో ఇప్పటివరకు టాలీవుడ్ రేంజ్‌కు సరిపోయే స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. అయితే, ఇప్పుడు వచ్చే వార్ 2 మాత్రం రెండు ఇండస్ట్రీలను కలిపే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్.
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ కలిపి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉంది. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కు భయపడే స్థాయిలో లేదు. ఒక్కో సినిమా ఒక్కో రికార్డును తిరగరాస్తూ బాలీవుడ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాజమౌళి, సుకుమార్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు, దర్శకులు ప్రస్తుతం ఇండియన్ సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తున్నారు.
టాలీవుడ్ సినిమా కథ, విజువల్ ప్రెజెంటేషన్, మాస్ అప్పీల్ అన్నీ బాలీవుడ్ కంటే మైల్స్ ముందుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వార్ 2 బాలీవుడ్ + టాలీవుడ్ కలయికగా మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని అందరూ ఆశిస్తున్నారు.
టాప్ 5 ఇండియన్ ఫస్ట్ వీకెండ్ గ్రాస్ కలెక్షన్లు:
1. పుష్ప 2: ది రూల్ - ₹600Cr+
2. బాహుబలి 2 - ₹540Cr
3. RRR - ₹496Cr
4. జవాన్ - ₹384Cr+
5. కాల్కి 2898 AD - ₹380Cr+
ఇప్పుడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2 ఈ లిస్టులో ఎక్కడ నిలుస్తుందో చూడాలి.