రెండ్ లవ్ మ్యాటర్.. హైదరాబాద్ లో స్టూడెంట్ కిడ్నాప్

భాగ్యనగరిలో తాజాగా వెలుగు చూసిన ఒక కిడ్నాప్ ఉదంతం కలకలాన్ని రేపుతోంది. దీనికి ఒక ప్రేమ వ్యవహారం కారణం కావటం సంచలనంగా మారింది

Update: 2024-02-12 04:19 GMT
రెండ్ లవ్ మ్యాటర్.. హైదరాబాద్ లో స్టూడెంట్ కిడ్నాప్
  • whatsapp icon

భాగ్యనగరిలో తాజాగా వెలుగు చూసిన ఒక కిడ్నాప్ ఉదంతం కలకలాన్ని రేపుతోంది. దీనికి ఒక ప్రేమ వ్యవహారం కారణం కావటం సంచలనంగా మారింది. స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఒక విద్యార్థి కిడ్నాప్ కావటం.. అమ్మాయి సోదరుడే ఈ పనికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిజామాబాద్కు చెందిన ఉదయ్ రాజ్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఉంటున్నారు.

హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్న అతడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు ప్రథ్వీ. అతనికి ఒక అమ్మాయితో లవ్ మ్యాటర్ సాగుతోంది. ఈ విషయం గురించి తెలిసిన ఆమె సోదరుడు ఉదయ్ రాజ్ వద్దకు వచ్చి అతడికి వార్నింగ్ ఇచ్చాడు. తన సోదరి ప్రేమకు కారణం ఉదయ్ అని భావించటమే దీనికి కారణం. దీంతో భయపడిపోయిన ఉదయ్ వెంటనే తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

పోచారం ఐటీ కారిడార్ లోని సంస్క్రతి టౌన్ షిప్ లో ఉంటున్న ఫ్రథ్వీ ఇంటికి వెళ్లి.. విషయం మొత్తం చెప్పాడు. శనివారం రాత్రి వారిద్దరు బయటకు రాగా.. రెండు టూవీలర్ల మీద వచ్చిన యువతి సోదరుడు ఉదయ్ ను బలవంతంగా తమతో తీసుకెళ్లారు. మల్కాజిగిరిలోని ఒక గదిలో బంధించి తీవ్రంగా హింసించారు. వారి బారి నుంచి తప్పించుకున్న అతను పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను కిడ్నాప్ చేసిన వారిపై కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపింది.

Tags:    

Similar News