మీర్ పేట మాధవి మర్డర్ కేసులో మరిన్ని దారుణ నిజాలు

ఈ హత్య ఉదయం 6-7 గంటల మధ్యలో జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-26 04:34 GMT

సంచలనంగా మారిన మీర్ పేట మాధవి మర్డర్ విషయంలో మరిన్ని దారుణ నిజాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో భార్యను హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నప్పటికి.. దానికి సంబంధించిన ఆధారాలు.. సాంకేతిక రుజువుల్నిసేకరించటం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వాడుకున్న పోలీసులు.. ఎట్టకేలకు ఈ దారుణ హత్య కేసు విచారణలో పురోగతి సాధించినట్లుగా చెబుతున్నారు. పక్కా ప్లాన్ తో.. అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేయటం ఒక ఎత్తు అయితే.. ఆమె శరీరాన్ని మాయం చేసేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం నోటి వెంట మాట రాకుండేలా చేసిందని చెప్పాలి.

కనుమ పండుగ రోజు ఉదయాన్నే భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ హత్య ఉదయం 6-7 గంటల మధ్యలో జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం భార్య డెడ్ బాడీని మాయం చేసేందుకు పథకాన్ని సిద్ధం చేసుకున్న నిందితుడు.. ఆపై తన ప్లాన్ ను అమలు చేయటం ప్రారంభించారు. భార్య శరీరాన్ని ఐదారు ముక్కలుగా నరికేసి.. అనంతరం బాత్రూంలోని బకెట్ లో ఒక్కొక్కటిగావేయటం.. వాటిని వాటర్ హీటర్తో పెద్ద ఎత్తున ఉడికించి.. అనంతరం ఎముకల్ని వేరు చేశాడు. ఆ ఎముకల్ని గ్యాస్ పొయ్యి మీద మంటల్లో కాల్చేశాడు. అనంతరం వాటిని విరగొట్టాడు.

అలా ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో మునిగిపోయిన గురుమూర్తి.. చివరకు భార్య శరీరాన్ని మాంసం ముద్దగా మార్చేసి.. చెరువులో కలిపేశాడు. తర్వాత ఇంటికి వచ్చి.. ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా కడిగేశాడు. అయితే.. బ్లూ రేస్ టెక్నాలజీతో కంటికి కనిపించని రక్తపు మరకల్ని గుర్తించటంతోపాటు.. వాటి శాంపిళ్లను సేకరించారు.

తాజాగా మాధవి పిల్లలు.. ఆమె తల్లి డీఎన్ ఏను పోలీసులుసేకరించి.. తాము సేకరించిన సాంకేతిక ఆధారాలతో వాటిని సరిపోల్చనున్నారు. మొదట్లో ఈ కేసును సాంకేతికంగా నిరూపించటం క్లిష్టంగా ఉన్న స్థితి నుంచి ఇప్పుడు హత్య జరిగిన వైనం.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులు సంపాదించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. గురుమూర్తి చేసిన దారుణ హత్య వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News