హైదరాబాద్ లో తండ్రిని హత్య చేసిన కొడుకు... సీసీ కెమెరాలో ఘోర దృశ్యాలు!
అవును... హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగా.. ఓ కుమారుడు తన కన్న తండ్రిని హతమార్చాడు.
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తండ్రిపై కన్న కొడుకే కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. ఈ సమయంలో అతడు 32 సార్లు కత్తితో పొడిచినట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది!
అవును... హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగా.. ఓ కుమారుడు తన కన్న తండ్రిని హతమార్చాడు. ఈ సందర్భంగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలు తెలిపారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగలి (45), అతడి కుమారుడు సాయి కుమార్ (25).. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మొగలి.. నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు! దీంతో.. తండ్రి ప్రవర్తనపట్ల కొడుకు సాయికుమార్ విసిగిపోయాడు.
ఈ క్రమంలో... శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగలి బస్సులో బయలుదేరగా.. వెనుక సాయికుమార్ బైక్ పై తండ్రిని ఫాలో అయ్యాడు. ఈ సమయంలో ఈసీఐఎల్ బస్ టెర్మినల్ సమీపంలో బస్సు దిగాడు మొగిలి. దీంతో... సాయికుమార్ కత్తితో అతడిపై ఒక్కసారిగా దాడి చేశాడు. అంతా చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ సమయంలో... మొగిలి తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటాడి మరీ పొడిచి చంపాడు! రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు! అయితే.. అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరోపక్క.. మొగిలిపై సాయికుమార్ అత్యంత కిరాతకంగా జరిపిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి!
ఈ సందర్భంగా సాయికుమార్ సుమారు 32 సార్లు కత్తితో తన తండ్రిని పొడిచినట్లు చెబుతున్నారు. ఇక.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క.. మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.