వైరల్ స్టోరీ... స్కామర్ నే బురుడీ కొట్టించిన యువకుడు!

ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువకుడికి ఇలానే కాల్ వచ్చింది. అయితే... అతడు ఏమాత్రం పానిక్ అవ్వకుండా స్కామర్లనే బురిడీ కొట్టించాడు.;

Update: 2025-03-17 07:40 GMT

మీకు వచ్చిన పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నాయి.. మీరు విదేశాలకు పంపిన పార్శిల్స్ లో ఇండియన్ కరెన్సీ ఉంది.. మేము సీబీఐ నుంచి కాల్ చేస్తున్నామ్.. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామ్.. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అంటూ కొత్త తరహాలో ఇటీవల సైబర్ నేరగాళ్లు, స్కామర్లు నిలువుదోపిడీ చేస్తున్న ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎంతో మంది ఈ డిజిటల్ అరెస్ట్ బాధితులుగా మారారు. పోలీసు అధికారుల దుస్తుల్లో స్కామర్లు నేరుగా వీడియో కాల్స్ మాట్లాడటంతో.. బాధితులు వెంటనే నమ్మేవారు.. వారికి సరెండర్ అయిపోయేవారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువకుడికి ఇలానే కాల్ వచ్చింది. అయితే... అతడు ఏమాత్రం పానిక్ అవ్వకుండా స్కామర్లనే బురిడీ కొట్టించాడు.

అవును... ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన భూపేంద్రసింగ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారి పేరిట ఆన్ లైన్ మోసగాడు ఒకరు కాల్ చేశారు. ఈ సందర్భంగా... తనవద్ద అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని.. దీనికి సంబంధించిన కేసు మూసేయడానికి రూ.16వేలు ఇవ్వాలంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు.

దీంతో... విషయం గ్రహించిన భూపేంద్ర... ఆ స్కామర్ నే ఓ ఆటాడుకోవాలని ఫిక్సయ్యాడు. వెంటనే పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా... ప్లీజ్ ఆ వీడియోలు గురించి మా అమ్మకు చెప్పొద్దు.. మీరు గనుక చెప్పారంటే నేను చాలా ఇబ్బందుల్లో పడిపోతాను అని భయపడుతున్నట్లు నటించారు.

దీంతో... సరే మీ అమ్మకు చెప్పను కానీ.. ముందు డబ్బులు పంపించు అని డిమాండ్ చేశాడు. ఇప్పుడు భూపేంద్ర స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు.. ఇందులో భాగంగా... తాను ఇటీవల ఓ బంగారు గొలుసు తాకట్టు పెట్టానని.. దానిని విడిపించడానికి రూ.3వేలు కావాలని స్కామర్ నే అడిగాడు. ఆ మాటలు నమ్మిన సైబర్ నేరగాడు భూపేంద్రకు మనీ పంపించాడు.

అనంతరం స్కామర్ బుట్టలో పడ్డాడని భావించిన భూపేంద్ర.. కథ కంటిన్యూచేశాడు. ఇందులో భాగంగా... తాను మైనర్ అని, అందువల్ల నగల వ్యాపారి ఆ గొలుసు తాకట్టు నుంచి ఇవ్వడం లేదని.. మీరే నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలంటూ కేటుగాడిని అడిగాడు. ఈ సమయంలో.. భూపేంద్ర ఫ్రెండ్ ఒకరు నగల వ్యాపారి అవతారమెత్తాడు.

ఈ సమయంలో భూపేంద్ర ఫ్రెండ్... నగల వ్యాపారిలా స్కామర్ ను నమ్మించాడు.. దీంతో మరో రూ.4,480 పంపించాడు. అనంతరం ప్రాసెస్ ఫీజ్ కింద రూ.3 వేలు ఇస్తే.. ఆ గొలుసుపై లక్ష రూపాయలు పైనే రుణం ఇస్తానని మళ్లీ నమ్మించాడు. దీంతో.. స్కామర్ మరో మూడు వేలు పంపించాడు. ఈ విధంగా సుమారు పదివేలు పైన పంపించాడు.

అప్పటికి విషయం గ్రహించిన స్కామర్... తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని భూపేంద్రను బ్రతిమాలుకోవడం ఈ స్టోరీలో హైలైట్ పాయింట్! అయితే.. అందుకు అంగీకరించని భూపేంద్ర, విషయం పోలీసులకు చెప్పాడు. స్కామర్లు, సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు లొంగకుండా భూపేంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News