భర్తను చంపేసి ప్రియుడితో వెళ్లిపోయి పోలీసులకు ఎలా దొరికింది?

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన అనంతరం.. కసోల్ లోని హోటల్ లో ఉన్న ఆర్నోజుల పాటు ఉన్న వేళలో ఎవరిని లోపలకు అనుమతించేవారు కాదని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.;

Update: 2025-03-23 04:26 GMT

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మర్చంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ హత్య ఉదంతానికి సంబంధించిన పలు షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. దారుణ హత్యకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ వారిని అడ్డంగా బుక్ చేసింది. భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. దారుణంగా హత్య చేసి.. ప్రియుడితో పారిపోయిన ముస్కాన్ పోలీసులకు ఎలా చిక్కింది? అన్న సందేహం వచ్చిందా? దీనికి సమాధానం ఇదే..

ప్రియుడు సాహిల్ తో కలిసి భర్త సౌరభ్ కు నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులో కూరుకుపోయిన తర్వాత దారుణంగా హతమార్చటం.. శవాన్ని మాయం చేసేందుకు డెడ్ బాడీని ముక్కలుగా నరికి.. డ్రమ్ లో పెట్టి సిమెంట్ సీల్ వేయటం.. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోవటం తెలిసిందే.

అనంతరం వారు హిమాచల్ ప్రదేశ్ లోని కసోల్ లో ఒక లాడ్జి తీసుకున్నారు. అక్కడి వారికి తామిద్దరం భార్యభర్తలుగా చెప్పుకున్నారు. దాదాపు ఆరురోజుల పాటు ఒకే లాడ్జ్ లో ఉన్న వారుబయటకు రాకపోవటం.. ఒకవేళ పని వాళ్లు పని చేసేందుకు వెళ్లినా.. రోజువారీ నిర్వహణకు సంబంధించిన పని వారిని సైతం తమ గదిలోకి రానిచ్చేవారన్న పోలీసులు గుర్తించారు. అయితే.. ఇదంతా సదరు హోటల్ యజమాని పోలీసుల కంటే ముందుగా అనుమానించారు.

ఎందుకంటే.. పెళ్లి చేసుకొని భార్యతో హాలీడే స్టాప్ కోసం వెళ్లిన వారు ఎవరైనా సరే.. తొలుత భర్త లేదంటే భార్య హోటల్ గదికే పరిమితం కావటం చాలా చాలా అరుదుగా వ్యవహరిస్తారని గుర్తించారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన అనంతరం.. కసోల్ లోని హోటల్ లో ఉన్న ఆర్నోజుల పాటు ఉన్న వేళలో ఎవరిని లోపలకు అనుమతించేవారు కాదని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

రోజులో ఒక్కసారి మాత్రమే బయటకువెళ్లేవారని.. హోటల్ ను ఖాళీ చేసిన తర్వాత సిబ్బందితో మట్లాడిన సందర్భంలోనూ తాము మనాలీ నుంచి వచ్చామని.. యూపీకి వెళ్లనున్నట్లుగా పేర్కొన్నారు. సౌరభ్ హత్య కేసులో ముస్కాన్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేయటడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నామని.. త్వరలోనే విచారణను పూర్తి చేస్తామని చెబుతున్నారు పోలీసులు. నిజానికి భర్తను చంపి తెలివిగా పారిపోయినప్పటికి .. రోజుల తరబడి హోటల్లోనే ఉండిపోవటం వారిని పోలీసులకు దొరికేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కిరాతకంగా వ్యవహరించిన ముస్కాన్.. ఆమె ప్రియుడి ఇద్దరూ ఇప్పుడు జైలు ఊచల్ని లెక్కిస్తున్నారు.

Tags:    

Similar News