అమెరికా చదువులకు ఇండియాలో ఎందుకంత క్రేజ్.. కారణమేంటి?
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందులో మన దేశం వారు అతీతులేమీ కాదు.
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందులో మన దేశం వారు అతీతులేమీ కాదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. తమ కొడుకు అమెరికా వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. దీనికి ఉన్న ఆస్తులను అమ్మి విదేశాలకు పంపిస్తున్నారు.
అమెరికాలో ప్రస్తుతం 2.89 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2022-23 సంవత్సరంలో వీరి సంఖ్య 35 శాతం పెరగడం గమనార్హం. ఇన్నాళ్లు అమెరికాలో చైనా విద్యార్థులే అధికం కాగా ప్రస్తుతం వారి స్థానాన్ని మనవారు అధిగమిస్తున్నారు. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డల్లాస్ లలో చైనా కన్నా మన విద్యార్థులు 3 వేల నుంచి 4,400 పెరగడం విశేషం.
భారతీయ విద్యార్థుల ఉత్సాహం గుర్తించిన యూనివర్సిటీలు వారిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ చదువుకోవడానికి వారికి కావాల్సిన అన్ని వనరులు కల్పిస్తున్నాయి. దీంతో మన విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్లేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. అక్కడ చదువుకుంటే జీవితం స్థిరపడుతుందని భావించి అక్కడే చదువుకోవాలని పట్టుబడుతున్నారు. మన వారి ఆశయాలను గుర్తించిన విద్యాసంస్థలు వారికి చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం మన దేశం నుంచి 15 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు. అమెరికా యూనివర్సిటీల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉంటున్నారు. మన వారికి విదేశాలంటే ఎంత మోజు ఉందో అర్థమవుతోంది. ఇలా దేశం విడిచి వెళ్లి అక్కడే స్థిరపడాలని భావిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది.
భారతీయ విద్యాసంస్థల కంటే అమెరికాలోనే ప్రవేశాలు పొందడం సులభంగా మారింది. అందుకే అధిక శాతం మంది అక్కడికే వలస వెళ్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాల ఆమోదం రేటు 0.2 ఉండగా అమెరికాలో పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంకా ఎక్కువ ఉండటం చూస్తుంటే మన వారు అక్కడకే వెళ్లాలని భావిస్తున్నారు. దీంతోనే మన విద్యార్థులు విదేశాల బాట పడుతూ అక్కడే స్థిరపడుతున్నారు.