ఒక్క రోజు జపాన్‌ స్కూల్‌లో కూర్చోవాలంటే రూ.17 వేలు..!

ఈ విషయాన్ని పలు సంస్థలు నిర్థారించాయి. అందుకే ఆ దేశంకు వెళ్లి విద్యా వ్యవస్థను చూడటం కోసం, అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు.

Update: 2024-12-09 21:30 GMT

జపాన్ అన్ని రంగాల్లోనూ దసుకు పోతుంది. ఒకానొక సమయంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న జపాన్‌ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు చైనా ఇంకా పలు అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలతో పోటీగా నిలుస్తూ దూసుకు పోతుంది. అందుకు ప్రధాన కారణం అక్కడ విద్యార్థులకు అందిస్తున్న విద్య అంటూ ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది. ఆసియాలోనే అత్యుత్తమ విద్యను అందిస్తున్న దేశాల్లో జపాన్‌ ముందు వరుసలో ఉంది. ఈ విషయాన్ని పలు సంస్థలు నిర్థారించాయి. అందుకే ఆ దేశంకు వెళ్లి విద్యా వ్యవస్థను చూడటం కోసం, అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు.

జపాన్‌కి ప్రతి నెల వందల సంఖ్యలో ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్‌ విద్యాసంస్థల వారు సందర్శకులుగా వెళ్తున్నారు. వారు అక్కడి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకోవడం కోసం జపాన్‌కి చెందిన ఒక సంస్థ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారు జపాన్‌ విద్యా వ్యవస్థను తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా వారికి సర్వీస్ చేయడంతో పాటు, తాము లాభపడే విధంగా ఒక బిజినెస్‌ను సదరు సంస్థ ప్లాన్‌ చేయడం జరిగింది.

ఉండకోయ అనే జపనీస్ సంస్థ అక్కడి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని విజిటర్స్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి విద్యా వ్యవస్థను పరిచయం చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులు ముందస్తుగానే ఆన్ లైన్ ద్వారా ఆ సంస్థతో చర్చలు జరిపి, అన్ని వివరాలు అడిగి తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు. జపాన్‌లో ల్యాండ్‌ అయినప్పటి నుంచి అక్కడి విద్యా విధానంను గురించి వివరాలు తెలియజేయడం, అక్కడి విద్యాసంస్థలను తిప్పి చూపించడం వంటివి చేస్తారు.

ఒక రోజు మొత్తం మొత్తం స్కూల్‌ లో కూర్చుని టీచర్స్ చెప్పే పాటలు వినేందుకు సైతం ఈ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలా చేసినందుకు గాను సదరు సంస్థకు విజిటర్స్ రూ.17 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజు జపాన్‌ క్లాస్ రూం అనుభవం పొందాలి అంటే రూ.17 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకుని అక్కడకు వెళ్లిన వారికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. అందుకే వారు ప్రతి రోజు ఈ వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలివి ఉంటే ఎలా అయినా సంపాదించవచ్చు అని ఈ సంస్థ మరోసారి నిరూపించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి సర్వీస్ చేసినట్లు ఉంది, సంపాదన క్రియేట్‌ అవుతుంది. ఇది చాలా మంచి బిజినెస్ ఐడియాగా స్థానిక మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి.

Tags:    

Similar News