కంప్లైంట్ చేస్తే పోలీసులు నా మీదే కేసు!
లైంగిక వేధింపుల అంశం నిత్యం చర్చకొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని రంగాల్లో లైంగిక వేధింపులున్నా? నిత్యం హైలైట్ అయ్యేది బాలీవుడ్ పరిశ్రమే.;
లైంగిక వేధింపుల అంశం నిత్యం చర్చకొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని రంగాల్లో లైంగిక వేధింపులున్నా? నిత్యం హైలైట్ అయ్యేది బాలీవుడ్ పరిశ్రమే. సెలబ్రిటీలు మాత్రమే ఈ అంశంపై మాట్లాడటంతో ఎక్కువగా ఫోకస్ అవుతుంది. తాజాగా `షీ`, `ఆశ్రమం` వెబ్ సిరీస్ ల్లో నటించిన అదితి పోహంకర్ బాల్యంలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల నుంచి వివిధ సందర్భాల్లో ఎదుర్కున్న ఘటనలను గుర్తు చేసుకుంది.
ఆవేంటో ఆమె మాటల్లోనే..` నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు అమ్మ నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఆ సమయంలో ఒకరు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కూర్చోవడానికి సీటు లేకపోవడంతో నుంచుని ఉన్నాను. ఆసమయంలో ఒకడు నాపై చేయి వేయడం గమనించాను. వెంటనే అమ్మతో వెంటనే చెప్పాను. దీంతో అతడు భయంతో వెళ్తున్నాడు. ఆ సమయంలో అమ్మ పక్కకు లాగేసింది.
దీంతో నాకు గాయమైంది. ముంబైలో రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవం తప్పలేదు. లేడీస్ కంపార్ట్ మెంట్ లో ఉన్నప్పుడు ఓ 17 ఏళ్ల కుర్రాడు అకస్మాతుగా నా ఛాతిని టచ్ చేసాడు. దీంతో నేను షాక్ అయ్యాను. అప్పుడు నాకేం అర్దం కాలేదు. అరిచినా చుట్టూ ఉన్న వారెవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే? ఆధారం ఏంటని అడిగాడు. తిరిగి నాపైనే కేసు పెడతా మన్నారు.
ఆ కుర్రాడు ముందు స్టేషన్లోనే దిగిపోయాడు. ఆ వయసులో ఆ కుర్రాడి ఆలోచన నన్ను బాగా కలిచి వేసింది. పిల్లలు ఇలా అయిపోతున్నారేంటి? అనిపించింది` అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదితి పోహంకర్ కి బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరుంది. అమ్మడు `షీ`లో మితి మీరిన గ్లామర్ షో చేసింది. విజయ్ వర్మతో ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటించింది.