ఆ స్టార్ హీరో పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఏ సినిమాకు పని చేసినా ఆ చిత్ర యూనిట్ తో మమేకం అవుతుంది.;
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఏ సినిమాకు పని చేసినా ఆ చిత్ర యూనిట్ తో మమేకం అవుతుంది. హీరో..డైరెక్టర్ తో మంచి ప్రెండ్ షిప్ ని బిల్డ్ చేసుకుంటుంది. రష్మిక సక్సెస్ అవ్వడంలో ఇదీ ఒక కారణం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి `సికిందర్` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రచారం పనులు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అమ్మడు సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. `సల్మాన్ ఖాన్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఎంతో క్లారిటీతో ఉంటారు. సెట్ లో ఎంతో ఎనర్జీతో ఉంటారు. ఎలాంటి యాక్షన్ సన్నివేశం చేసినా? ఆయనలో ప్రెష్ నెస్ మాత్రం తగ్గదు. ఎంతో యాక్టివ్ గా పని చేస్తారు` అంది. సల్మాన్ తో కలిసి పనిచేయడం తన కల అని అది ఈ సినిమాతో నెరవేరు తుందని..ఆరోగ్యం సరిగ్గా లేకపోతే షూటింగ్ సమయంలో ఇంటి భోజనం కూడా పంపించేవారని గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.
`సికిందర్` సక్సెస్ అయితే రష్మిక ఇమేజ్ మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పటికే అమ్మడు `యానిమల్` సినిమాతో బాలీవుడ్ లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే తనలో రొమాంటిక్ యాంగిల్ ని బాలీవుడ్ కి పరిచయం చేసింది. అటుపై `ఛావా`తో మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ఇందులో ఏసుబాయి పాత్రలో రష్మిక అభినయంతో తనలో మరో గొప్ప నటి ఉందని ప్రూవ్ చేసింది. ప్రస్తుతం హిందీలో థామాలో నటిస్తోంది. అలాగే తెలుగులో ధనుష్ , నాగార్జున నటిస్తోన్న `కుభేర`లోనూ నటిస్తోంది. `ది గర్ల్ ప్రెండ్` అనే మరో తెలుగు సినిమా కూడా చేస్తోంది.