ఉడుకు ర‌క్తం ఎవ‌రి మాట వినేవాడిని కాదు!

తాజాగా ఈ హీరోని 2023 ఎలా గ‌డిచిందంటే? ఆ స‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. 'అనుకున్నంత ఆశాజనకంగా లేని మాట వాస్తవమే. నాకూ బ్రేక్‌ తీసుకోవాలని అనిపిం చింది.

Update: 2023-12-18 13:30 GMT

సాయికుమార్ వార‌సుడిగా టాలీవుడ్ కి తెర‌గేట్రం చేసిన ఆది సుప‌రిచితుడే. 'ల‌వ్ లీ'..'ప్రేమ కావాలి' లాంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఆది ఆ త‌ర్వాత అంతే వేగంగాను చ‌తికిల ప‌డ్డాడు. ఆ రెండు విజ‌యాలు ఎన్నో అవ‌కాశాల‌కు దారులు వేసాయి. కొత్త అవ‌కాశాలు చాలా అందుకున్నాడు. కానీ అందులో విజ‌యాలు ఎన్ని? అంటే వెన‌క్కి తిరిగి చూడాల్సిన స‌న్నివేశమే క‌నిపించింది.


తండ్రి ఇమేజ్ తోనో..త‌న‌కు ప్ర‌తిభ‌ను అవ‌కాశాలైతే అందుకున్నాడు గానీ...ఆ త‌ర్వాత విజ‌యాల్ని మాత్రం కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. కెరీర్ లో గ్యాప్ లేకుండా సినిమాల నెంబ‌ర్ అయితే పెంచుకు న్నాడు గానీ....స‌క్సెస చివ‌రి నుంచి మొద‌టివ‌ర‌కూ ఎక్క‌డా క‌నిపించ‌దు. తాజాగా ఈ హీరోని 2023 ఎలా గ‌డిచిందంటే? ఆ స‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. 'అనుకున్నంత ఆశాజనకంగా లేని మాట వాస్తవమే. నాకూ బ్రేక్‌ తీసుకోవాలని అనిపిం చింది. కొన్ని కథలు విన్నా. కానీ ఒప్పుకోలేదు.

ఎందుకంటే ఇదివరకు కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని అనుకున్నాను. క‌థ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలనుకున్నా. అందుకే కొంత గ్యాప్‌ వచ్చింది. ఈ ప్రయా ణంలో 'రుధిరాక్ష' రూపంలో మంచి కథ దొరికింది. బడ్జెట్‌ పరంగా పెద్ద సినిమానే. నా గెటప్‌ కూడా కొత్తగా ఉండబోతోంది. జనవరిలో షూటింగ్‌ మొదలెడతాం. ఇది కాకుండా మరో కథ కూడా సిద్ధంగా ఉంది అన్నాడు.

నా వరకూ నాన్న మంచి సలహాలే ఇచ్చారు. కాకపోతే జడ్జిమెంట్‌ మాత్రం పూర్తిగా నాదే. ఇక్కడ ఎవరి కెరీర్‌ని వాళ్లే నిర్మించుకోవాలి. మరొకర్ని నిందించలేం. నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర ఆడక పోయినా... ఓటీటీల్లో బాగానే చూశారు. కాకపోతే థియేటర్లో ఒక్క హిట్టు పడాలి. దాని కోసమే నా ప్రయత్న మంతా. సలహాలు ఎవరిచ్చినా తీసుకొంటా. ఆ విషయంలో ఇగోలు లేవు. వచ్చిన కొత్తలో ఉడుకు రక్తం కదా? ఎవరి మాటా వినేవాణ్ణి కాదు. ఆ విషయంలో ఇప్పుడు చాలా మారాను. ఎవ‌రు ఏం చెప్పినా వింటున్నాను. అందులో స‌రైనది ఏదో తెలుసుకుంటున్నాను. ఇప్పుడా ప‌రిణితి నాలో వ‌చ్చింది' అని అన్నారు.

Tags:    

Similar News