అలాంటి వాళ్లకి అవకాశం..భవిష్యత్ కే ప్రమాదం!
ఒకప్పుడు సినిమాలో అవకాశం అంటే కాళ్లరిగేలా సినిమా ఆఫీస్ లు చుట్టూ ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.
ఒకప్పుడు సినిమాలో అవకాశం అంటే కాళ్లరిగేలా సినిమా ఆఫీస్ లు చుట్టూ ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇలా తిరగాల్సిందే. అలా తిరిగినా ఎంతకాలానికి అవకాశం వస్తుందో కూడా తెలియదు. అందుకే ఎంత ట్యాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. సక్సెస్ అయి ఇప్పుడు రాణిస్తున్న వారంతా ఒకప్పుడు అలా కష్టపడినవారే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిన సంగతి తెలిసిందే.
ఆఫీస్ లు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ట్యాలెంట్ ని ప్రూవ్ చేస్తూ ఓ వీడియో చేసి వదిలితే చాలు. అది వైరల్ అయ్యి ఏ దర్శక, నిర్మాత దృష్టిలోనే పడితే అవకాశం పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఇంకా ఇన్ స్టా రీల్స్ ద్వారా కూడా చాలా మంది అవకాశాలు అందుకుంటున్నారు. అయితే నేటి జనరేషన్ ఇలా అవకాశాలు అందుకోవడం పై నటి అహానా ఎస్ కుమ్రా అసహనం వ్యక్తం చేసింది.
`నేను సినీ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు రీల్స్.. డాన్సు వీడియోలు చేయడం వంటివి లేవు. కానీ ఈ రోజు అలాంటి వీడియోలు చేస్తున్న వారికి ఎంత మంది ఫాలోవర్లు ఉంటున్నారో చూస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. సినిమా వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఇన్ ప్లూయోన్సర్లుగా చెప్పుకునేవారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానర్దం ఏంటి మేము కూడా ఇన్ ప్లూయోన్సర్లగా మారాలనా? అలాంటి వీడియోలు కొంత వరకే పరిమితం.
నటిగా చేయడానికి అవెందుకు పని చేయవు. అలాంటి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్ నటులకే ప్రమాదకరం. వాళ్లను చూసి మిగతా వారు కూడా వీడియోలు చేసి వచ్చేస్తారు. కఠినమైన పాత్రలు ఇస్తే చేతులెత్తేస్తారు. అందుకే నేర్చుకునే దశలోనే పక్కాగా నేర్చుకోవాలి. ఇది ఎంతో సాధనతో కూడాని పని. అలాంటి వారిని మేకర్స్ ఒడిసి పట్టుకోవాలి. అప్పుడే అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది` అని అంది.