పైప్ స్మోకింగ్ ఆల్కహాల్‌కి బానిసైన స్టార్ హీరో
చాలా మంది హీరోలు ఆల్కహాల్ కి బానిసలయ్యామని మీడియా ఎదుట అంగీకరించిన కథనాలు గతంలో వైరల్ అయ్యాయి.
చాలా మంది హీరోలు ఆల్కహాల్ కి బానిసలయ్యామని మీడియా ఎదుట అంగీకరించిన కథనాలు గతంలో వైరల్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ ఆల్కహాలిక్ అని ఇటీవల వివాదాస్పద సీనియర్ గాయకుడు అభిజీత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కంటే షారూఖ్ ఖాన్ పెద్ద సూపర్ స్టార్ అని కూడా అతడు వ్యాఖ్యానించాడు. చాలా ఇంటర్వ్యూలలో సదరు గాయకుడు సల్మాన్ ని తక్కువ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
ఇంతకుముందు తన కుమారుడు మంచు మనోజ్ ఆల్కహాలిక్ అని టాలీవుడ్ వెటరన్ హీరో మంచు మోహన్ బాబు మాట్లాడిన ఓ వాయిస్ వోవర్ కూడా మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తన ఆడియోలో మనోజ్ మద్యానికి బానిసయ్యాడని, తమ మధ్య కలతలు ఉన్నాయని ఆ ఆడియోలో వెల్లడించారు.
ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనకు ఉన్న తాగుడు అలవాటు గురించి స్వయంగా ప్రస్థావించారు. తనకు పైప్ స్మోకింగ్, ఆల్కహాల్ సేవించే అలవాట్లు ఉండేవని అన్నాడు. అయితే వ్యక్తిగతంగా క్రమశిక్షణ లేకపోయినా కానీ, షూటింగులకు సమయానికి హాజరయ్యేవాడినని తెలిపాడు. తప్పు చేస్తున్నానని తెలిసినా ఆపలేకపోయానని, కాలక్రమంలో సినిమాలే తనను మార్చాయని వెల్లడించాడు. సినిమా మంచి మెడిసిన్ అని కూడా వ్యాఖ్యానించారు.
తెలుగు, తమిళం, హిందీలో చాలా మంది తారలు తమకు ఉన్న ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవలి కాలంలో స్టార్లు తమకు ఉన్న చెడు అలవాట్లు, డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడి, తమ తప్పులను అంగీకరించడం ట్రెండ్‌గా మారింది.