'కఠిన చర్యలు తీసుకుంటాను'.. పృథ్వీ రాజ్ ఫైర్

టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు పృథ్వీరాజ్

Update: 2024-06-14 14:54 GMT
కఠిన చర్యలు తీసుకుంటాను.. పృథ్వీ రాజ్ ఫైర్
  • whatsapp icon

టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు పృథ్వీరాజ్. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా అనేక సినిమాలతో మూవీ లవర్స్ ను అలరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన్ను అంతా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా పిలుచుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక 1984లో పృథ్వీరాజ్‌ కు శ్రీలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే ఆమెకు మనోవర్తి బకాయిలు చెల్లించకపోవడంతో పృథ్వీరాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. అవన్నీ అవాస్తవాలని వీడియో ద్వారా తెలిపారు.

"కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని కథనాలు వచ్చాయి. పృథ్వీరాజ్ అరెస్ట్, కోర్టులో లొంగిపొమ్మన్నారు, పృథ్వీరాజ్ అలాంటోడు... ఇలాంటోడు అంటున్నారు. గత మూడేళ్లుగా మొదటి భార్యకు భరణం చెల్లించడంలేదుని.. అందుకే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని కథనాలు వచ్చాయి. ఇప్పుడు అందరికీ ఓ విషయం చెప్పాలి. నా మొదటి భార్యకు కోర్టు ఎంత చెల్లించాలని చెప్పిందో, అంత మొత్తంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాను. జూన్ వరకు చెల్లించాను" అని తెలిపారు.

"ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టు పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. కోర్టు నిర్దేశించిన నగదును ప్రతి నెలా హైకోర్టు ఖాతాలో జమ చేస్తున్నాను. కానీ ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వార్తలు రాశారు. అంత అవమానకరంగా రాయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏం జరిగింది అని నన్ను అడిగితే నేను వాస్తవాలు చెప్పేవాడ్ని కదా" అని అన్నారు.

"నేను మా లాయర్లను ఇప్పుడు కనుక్కున్నాను. ఆ కథనాలు చూసి వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా వార్తలు రాశారుని అడిగారు. నా గురించి తప్పుగా రాసిన యూట్యూబ్ చానళ్లు, ఇతర మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. మా లాయర్లతో సంప్రదించి ముందుకెళ్తాను. త్వరలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను" అని పృథ్వీ రాజ్ అన్నారు.

Tags:    

Similar News