పిక్‌టాక్ : వారికి ఈ అందంతో చెంపదెబ్బ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అందం గురించి ఆ మధ్య కొందరు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అందం గురించి ఆ మధ్య కొందరు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా ఆలియా గర్భవతి అయిన సమయంలో ఆమె గురించి కొందరు రకరకాలుగా కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆలియా అందం గురించి ట్రోల్స్ వచ్చాయి. ఆలియా ఇన్నాళ్లు అందంతో ఆకట్టుకుంది, నటనతో మెప్పించింది. కానీ ఇక మీదట నటనతో రాణించాల్సిందే, ఆలియా అందం తగ్గిందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆలియా అందం తగ్గడం కాదు కదా ఆమె అందం మరింత పెరిగింది అంటూ తాజా ఫోటోలను చూస్తే అభిమానులు మాత్రమే కాకుండా అంతా ఒప్పుకుంటారు అనడంలో సందేహం లేదు.
ఆలియా భట్ బాలీవుడ్‌లో అడుగు పెట్టి పుష్కర కాలం దాటింది. ఇండస్ట్రీలో ఆమె ఎంట్రీతోనే సంచలనం సృష్టించింది. కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లోనూ ఆలియా నటనతో ఆకట్టుకుంది. ఆ సమయంలోనే కొందరు నెపో కిడ్ అంటూ విమర్శలు చేసినా తన అందం, నటనతో ఆకట్టుకుంది. అందమైన రూపంతో అందరి చూపు తనవైపు తిప్పుకోవడం మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఈమె చేసిన ప్రదర్శణకి విమర్శకులు సైతం ఫిదా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెళ్లి అయ్యి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆలియా గురించి కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
సినిమా ఇండస్ట్రీకి ఆలియా దూరం ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ మాదిరిగా ఆలియా సైతం చాలా మారిపోయింది. ఆమె ఫిజిక్ విషయంలోనూ చాలా తేడాలు వస్తాయని ఊహాగాణాలు చేశారు. కానీ తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఈ అమ్మడు చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ఉంది. ఆలియా అందం గతంతో పోల్చితే ఇంకాస్త పెరిగిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మరోసారి ఆలియా అందంతో అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
ఆలియా భట్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సైతం స్పందించింది. ఆలియా బ్లాక్ డ్రెస్‌లో మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా ఉందనే కామెంట్స్ కొందరు చేస్తూ ఉంటే.. ఈ ఫోటోలతో తన అందం గురించి విమర్శలు చేసిన వారిని చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా చిన్న బ్రేక్ తీసుకున్న ఆలియా భట్ తిరిగి వరుస సినిమాలతో బిజీ కానుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఒక సినిమా రానుండగా వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు వస్తాయని తెలుస్తోంది.