'బ్యాడ్ గర్ల్' టీజర్.. వివాదాలకు దారి తీస్తుందా?
అయితే టీజర్ లో రోల్స్ మధ్య కొన్ని కన్వర్జేషన్స్ బోల్డ్ గా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని విషయాలు మాట్లాడకూడనవి ఉన్నాయి.
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారిద్దరూ కలిసి బ్యాడ్ గర్ల్ మూవీని నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ యూత్ డ్రామాగా తమిళ దర్శకుడు వర్ష భరత్ తెరకెక్కిస్తున్నారు. అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్, హృది హరూన్, టీజే అరుణాచలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి తదితరులు యాక్ట్ చేస్తున్నారు.
అమిత్ త్రివేది సంగీతం సమకూర్చున్నారు. ప్రీతి జయరామన్, జగదీష్ రవి, ప్రిన్స్ ఆండర్సన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక సంప్రదాయ అగ్ర కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన అమ్మాయి చుట్టూ సినిమా అంతా తిరుగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
ఫలానా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. బాయ్స్ తో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. ఆ తర్వాత పలు వ్యసనాలకు అలవాటు పడుతుంది. అలా చివరకు తల్లిదండ్రులు నిలువరించాలని చూస్తారు. అప్పుడు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. అలా ఆ పాయింట్ల చుట్టూ సినిమా అంతా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.
అయితే టీజర్ లో రోల్స్ మధ్య కొన్ని కన్వర్జేషన్స్ బోల్డ్ గా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని విషయాలు మాట్లాడకూడనవి ఉన్నాయి. దీంతో అమ్మాయిని చిత్రీకరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. కావాలని చెడుగా చూపిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ పరంగా మరికొందరు నిరసన తెలుపుతున్నారు.
అలాంటి కంటెంట్ యూత్ కు తప్పుడు మెసేజ్ ఇస్తుందని అంటున్నారు. కొన్ని విషయాలు కొత్తగా నేర్పిస్తున్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అంజలి శివరామన్ ఒదిగిపోయినట్లు కనిపించింది. కానీ ఆమె రోల్ విషయంలో మాత్రం అభ్యంతరం మాత్రం తెలుపుతున్నారు. టీజర్ పై భగ్గుమంటున్నారు.
అదే సమయంలో సినిమా పై కొందరు కేసులు పెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సంబంధిత కులం వారు ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. ఒకవేళ థియేటర్ల లో సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైనా.. వివాదాలు తలెత్తడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..