క్లాసిక్ 'సఖి' లో షారుక్ ఖాన్-కాజోల్ జోడీ!
మణిరత్నం క్లాసిక్ లవ్ స్టోరీల్లో `సఖి` ఒకటి. మాధవన్-శాలిని జోడీ అలరించిన తీరు అద్భుతం. ఆ రెండు పాత్రలు వాళ్ల కోసమే పుట్టాయా? అన్నంతగా పాత్రల్లో జీవించారు.
మణిరత్నం క్లాసిక్ లవ్ స్టోరీల్లో `సఖి` ఒకటి. మాధవన్-శాలిని జోడీ అలరించిన తీరు అద్భుతం. ఆ రెండు పాత్రలు వాళ్ల కోసమే పుట్టాయా? అన్నంతగా పాత్రల్లో జీవించారు. ఆన్ స్క్రీన్ పై పర్పెక్ట్ పెయిర్ గా ప్రశంసలందుకున్నారు. అద్భుతమైన లవ్ స్టోరీకి రెహమాన్ సంగీతం తోడవ్వడంతో మ్యూజికల్ గానూ సంచలనమైన చిత్రమది. సౌత్ లో అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించిన చిత్రమిది.
బాలీవుడ్ లో ఇదే చిత్రాన్ని `సాతియా` పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం చేసారు. మరి అలాంటి సినిమాలో ఒకవేళ మాధవన్-శాలిని కాకుండా హీరో , హీరోయిన్ కాకపోయి ఉంటే? ఎలా ఉండేది? అంటే ఆ సినిమా తీయకపోతే బాగుండేది అనిపిస్తుంది. అవును అంతగా ఆ పాత్రలకు కనెక్ట్ వాళ్లిద్దరేనని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ భావిస్తారు. వాళ్లు తప్ప ఆ రెండు పాత్రలకు మరొకరు న్యాయం చేయలేదన్నది అభిమానుల మాట.
అయితే వాస్తవానికి ఆ సినిమా మణిరత్నం షారుక్ ఖాన్, కాజోల్ తో తీయాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. తొలుత ఈ కథ షారుక్ కి ఖాన్ కి చెప్పారట. కథ విన్న వెంటనే ఆయన ఒకే చెప్పారట. అయితే అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదరలేదట. దీంతో తాత్కాలికంగా ఆస్టోరీని పక్కన బెట్టేసి అదే జోడీతో `దిల్ సే` సినిమా చేసినట్లు తెలిపారు. ఆసినిమా పూర్తయిన తర్వాత `సఖి` క్లైమాక్స్ ఐడియా కూడా తట్టిందన్నారు.
అలా `సఖి`లో కి మాధవన్- శాలిని వచ్చి చేరారు. నిజంగా ఆ పాత్రల్లో ఇద్దరు జీవించారు. అందుకే సినిమా అంత గొప్ప విజయం సాధించింది. `సఖి` చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. జూన్ 2న మణిరత్నం పుట్టిన రోజు. ఆ సంద్భంగా సఖి చిత్రాన్ని అడ్వాన్స్ సౌండింగ్ సిస్టమ్ తో రీ-రిలీజ్ చేయాలిన అభిమానులు అడుగుతున్నారు. మరి ఆ ఛాన్స్ తీసుకుంటారా? అన్నది చూడాలి.