స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్!
బాలీవుడ్ హీరోయిన్లలో కంగనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అందుకుంది.;
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏదొక వివాదం ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్లలో కంగనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. ఇప్పటివరకు కంగనా ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతూ సినిమాలు చేసింది లేదు. కంటెంటా, స్టార్ హీరోనా అంటే తన ఛాయిస్ కంటెంటే అంటుంది కంగనా.
కంటెంట్ లేకపోవడంతో తాను చాలా సినిమాలను రిజెక్ట్ చేసినట్టు కంగనా చెప్తోంది. సంజు మూవీలో హీరోయిన్ గా చేయమని రణ్‌బీర్ కపూర్ తన ఇంటికి వచ్చి పట్టుబట్టి మరీ అడిగాడని, కానీ దాన్ని తాను రిజెక్ట్ చేశానని, చివరికి ఆ పాత్ర అనుష్క శర్మకు వెళ్లిందని చెప్పింది. అయితే సంజు రిలీజయ్యాక అనుష్క పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అందరికీ తెలిసింది.
సంజుతో పాటూ పలు భారీ సినిమాలను కూడా కంగనా రిజెక్ట్ చేసింది. అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ మూవీకి కూడా తనను అడిగారని కానీ తాను కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా తన సినిమాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనుకోవడంతో ఆ సినిమాను ఒప్పుకోలేదంటుంది.
తన పాత్ర సంతృప్తిని ఇవ్వకపోవడంతో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్, సుల్తాన్ సినిమాల ఆఫర్లను కూడా వదులుకున్నట్టు చెప్పిన కంగన, ఆ సినిమాలు హిట్ అయ్యాక మాత్రం సల్మాన్ ను అభినందించిందట. సినిమాల విషయంలోనే కాదు, కంగన ఏ పని చేయాలన్నా అది ఆమెకు పూర్తిగా నచ్చాల్సిందే.
ఏదైనా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ విషయంలో కూడా కంగనా ఈ ఫార్ములానే పాటిస్తోంది. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా ఎమర్జెన్సీ అనే పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగన ఆ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఆ సినిమా కంగనకు చాలా పెద్ద ఫ్లాప్ ను ఇచ్చింది. ఏదేమైనా కంగన రూల్స్ కు అనుగుణంగా ఎలాంటి సినిమా చేయదు, తనకు కథ నచ్చితే ఫలితాన్ని ఆశించకుండా చేసేస్తుంది. అందుకే కంగనకు బాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది.