నటి మూడో పెళ్లి, రిసెప్షన్, హనీమూన్ ముచ్చట్లు
ఈసారి తన మూడో పెళ్లి వార్తలతో ఈ అమ్మడు చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా తాను మూడో పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ రాఖీ సావంత్. సోషల్ మీడియా గురించి ఏ మాత్రం అవగాణ ఉన్న వారికి అయినా రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈమె చేసే న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. ఒకానొక సమయంలో ఈ అమ్మడి తీరుపై చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. అయినా రాఖీ సావంత్ తన పద్దతిలో పాపులారిటీని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈమధ్య కాలంలో కాస్త సైలెంట్‌గా ఉన్న రాఖీ సావంత్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఈసారి తన మూడో పెళ్లి వార్తలతో ఈ అమ్మడు చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా తాను మూడో పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. కెరీర్ ఆరంభంలోనే పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయిన రాఖీ సావంత్ ఆ తర్వాత అదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి కొన్నాళ్లకే పెటాకులైంది. సోషల్ మీడియాలో సెన్షేషన్ కోసం రాఖీ సావంత్ చేసిన అతి కారణంగా అదిల్ ఖాన్ దురానీ ఆమె నుంచి విడిపోయాడు అనే వారు ఉన్నారు. అయితే విడాకులకు సంబంధించిన కారణం ఏంటి అనేది అధికారికంగా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
ఇప్పుడు రాఖీ సావంత్ మూడో పెళ్లికి సంబంధించి ప్రకటన చేసింది. పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రాఖీ సావంత్ ప్రకటించింది. నటుడిగా పలు సినిమాల్లో నటించిన డోడి ఖాన్ నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మించారు. వీరిద్దరికి పరిచయం ఎక్కడ ఏర్పడింది అనే విషయం తెలియాల్సి ఉంది. రాఖీ సావంత్ తాజాగా తాను మూడో పెళ్లి పాకిస్తాన్లో చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం తమ పెళ్లి ఉంటుందని, అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరగనున్నట్లు ఆమె పేర్కొంది.
పెళ్లి పాకిస్తాన్లో చేసుకున్నా రిసెప్షన్ మాత్రం ఇండియాలోనే ఉంటుందని రాఖీ సావంత్ తెలియజేసింది. సన్నిహితులు, బంధు మిత్రులను తన రిసెప్షన్‌కి ఆహ్వానించబోతున్నట్లు ఆమె తెలియజేసింది. ఇక రాఖీ తన మూడో పెళ్లి తర్వాత హనీమూన్ సైతం ప్లాన్ చేసింది. స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్స్‌కి హనీమూన్ కోసం వెళ్లబోతున్నట్లు పేర్కొంది. పెళ్లి తర్వాత తాను డోడితో కలిసి దుబాయ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు రాఖీ సావంత్ పేర్కొంది. మొత్తానికి ఈసారి రాఖీ చాలా పెద్ద ప్లాన్ వేసింది. మరి ఈసారి అయినా మొదటి రెండు పెళ్లిల మాదిరిగా కాకుండా ఈసారి వైవాహిక బంధం సవ్యంగా సాగుతుందా అనేది చూడాలి. సోషల్ మీడియా ద్వారా రాఖీ సావంత్ మూడో పెళ్లికి నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.