శ్రీలీల తో లిప్ కిస్సులు...ఇంటిమేట్ సీన్సా?
యంగ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కన్పమ్ అయిన సంగతి తెలిసిందే. అమ్మడికి హిట్ ప్రాంచైజీ ఆశీకీ 3 లో నటించే ఛాన్స్ వరించింది.
యంగ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కన్పమ్ అయిన సంగతి తెలిసిందే. అమ్మడికి హిట్ ప్రాంచైజీ ఆశీకీ 3 లో నటించే ఛాన్స్ వరించింది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా నటస్తుంది. అనురాగ్ బసు తెరకెక్కి స్తున్నాడు. ఫాంలో ఉన్న బాలీవుడ్ భామలందర్నీ కాదని మరీ శ్రీలీలను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసారు. `పుష్ప-2` లో కిసిక్ పాటతో అమ్మడు పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకుంది.
ఇప్పుడా క్రేజ్ హీరోయిన్ గా ప్రమోట్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పటివరకూ శ్రీలీల రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేదు. చేసింది తెలుగు సినిమాలే కాబట్టి అలాంటి ఛాన్స్ కూడా రాలేదు. లిప్ లాక్... ఇంటిమేట్ సీన్లు...బికినీ సీన్లు వంటివి చేసింది లేదు. కానీ `ఆశీకీ3` అంటే రొమాంటిక్ స్టోరీ. బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీతో పాటు రొమాంటిక్ సన్నివేశాలకు అనురగ్ బసు పెద్ద పీట వేస్తాడు.
లిప్ లాక్ ఇంటిమేట్ సీన్లు లేకుండా ఆశీకీ ప్రాంచైజీనే లేదు. అందులోనూ ఇప్పటి యువతని కనెక్ట్ చేస్తూ చేయాల్సిన చిత్రమిది. దీంతో సినిమాలో లెక్కకు మిక్కిలి రొమాంటిక్ సన్నివేశాలు..ఇంటిమేట్ సీన్స్ ఉంటాయనే ప్రచారం ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో జరుగుతోంది. దీంతో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అన్ని రకాలుగానూ సిద్ద పడాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ప్రేమలో ఘాడతను చెప్పే క్రమంలో బాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు సహజంగానే ఉంటాయి. అందులోనూ నేటి ట్రెండ్ ని అనుసరించి చేయాల్సిన సన్నివేశాలు కాబట్టి మరింత జోష్ గా శ్రీలీల ఆయా సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం అన్నది శ్రీలీలకు కొట్టిన పిండి. తానేంత బోల్డ్ అన్నది కిసిక్ పాటతోనే ప్రూవ్ చేసింది. ఈనేపథ్యంలో ఆషీకీ 3 లో అలాంటి సన్నివేశాలు శ్రీలీకు పెద్ద విషయం కాదన్నది కాదనలేని నిజం.