టాలీవుడ్ వైపు మల్లీశ్వరి కూడా..?

ఒకప్పుడు బాలీవుడ్ ని ఒక ఊపేసిన హీరోయిన్స్ లో కత్రినా కైఫ్ ఒకరు. ఆమె గ్లామర్ బీ టౌన్ ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది.

Update: 2025-02-19 17:30 GMT

ఒకప్పుడు బాలీవుడ్ ని ఒక ఊపేసిన హీరోయిన్స్ లో కత్రినా కైఫ్ ఒకరు. ఆమె గ్లామర్ బీ టౌన్ ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది. అందుకే ఆమెకు స్టార్ క్రేజ్ ఇచ్చారు. ఒక దశలో కత్రినా కైఫ్ లేని బాలీవుడ్ సినిమా లేదన్న రేంజ్ లో ఛాన్స్ లు అందుకుంది అమ్మడు. ఐతే కేవలం అక్కడే కాదు కత్రినా తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో స్టార్ అవ్వకముందే వెంకటేష్ తో మల్లీశ్వరి చేసిన అమ్మడు హిందీలో ఫాం లో ఉన్నప్పుడే బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమా చేసింది.

వెంకీ సినిమా అమ్మడికి మంచి సక్సెస్ అందించింది. ఐతే ఆ తర్వాత ఇక బాలీవుడ్ లోనే బిజీ అవ్వడం వల్ల సౌత్ సినిమాల వైపు చూడలేదు. ఇక పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ సినిమాల వేగాన్ని తగ్గించింది. విక్కీ కౌశల్ ని 2021 లో పెళ్లాడింది కత్రినా కైఫ్. అప్పటి నుంచి తన దాకా వచ్చిన సినిమాలనే చేస్తుంది. లాస్ట్ ఇయర్ కత్రినా కైఫ్ మెర్ర్రీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లైనా సరే సినిమాలు చేస్తారు. ఐతే కత్రినా మాత్రం సినిమాల దూకుడు తగ్గించింది. ఐతే బాలీవుడ్ లో సరైన ఛాన్స్ లు రావట్లేదని భావిస్తున్న కత్రినా కైఫ్ మళ్లీ సౌత్ సినిమాలు చేయాలని అనుకుంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు హంగామా చూస్తున్న కత్రినా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటుందట. కత్రినా చేస్తానంటే చాలు కానీ స్టార్ సినిమాల్లోనే ఛాన్స్ ఇస్తారని చెప్పొచ్చు.

తెలుగులో చేసిన రెండు సినిమాలతోనే కత్రినా ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ కు ఫెవరెట్ హీరోయిన్ గా ఉంది. ఇక మరోసారి అమ్మడు ఇక్కడ సినిమాలు చేస్తే కచ్చితంగా మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కత్రినా కైఫ్ టాలీవుడ్ షిఫ్ట్ అవ్వాలే కానీ ఆమెకు వరుస ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. మరి కత్రినా ఎవరితో సినిమా చేస్తుంది అన్నది చూడాలి. బాలీవుడ్ లో అయితే కత్రినా స్టార్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తుంది. ఐతే తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో కత్రినా నటిస్తే నేషనల్ లెవెల్ లో ఆ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News