అఖిరా - రిషి.. ఈ గాసిప్ భలే ఉందే!
టాలీవుడ్ లో ఈమధ్య వారసులకు సంబంధించిన గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు అఖిరా నందన్, త్రివిక్రమ్ కుమారుడు రిషి చుట్టూ ఒక గాసిప్ సర్కిల్ వేగంగా పాకుతోంది.
టాలీవుడ్ లో ఈమధ్య వారసులకు సంబంధించిన గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు అఖిరా నందన్, త్రివిక్రమ్ కుమారుడు రిషి చుట్టూ ఒక గాసిప్ సర్కిల్ వేగంగా పాకుతోంది. ఎంతవరకు నిజమో తెలియదుగానీ, ఈ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ - త్రివిక్రమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. బయటకు చెప్పకపోయినా కూడా వారు కెరీర్ మొదటి నుంచి కూడా చాలా క్లోజ్. ఇక ఇప్పుడు వీరి వారసుల విషయంలో ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
మొన్నటి న్యూస్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ అఖిరా నందన్ బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు టాక్ వచ్చింది. పవన్, త్రివిక్రమ్ మధ్య స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అఖిరా సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ గైడెన్స్ కీలకం కావడంతో, అఖిరా త్రివిక్రమ్ చేతిలోనే అనే టాక్ ఊపందుకుంది.
నిన్నటి న్యూస్ ఏమిటంటే, త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడం కోసం బలంగా సిద్ధమవుతున్నట్లు టాక్ వచ్చింది. మొదట త్రివిక్రమ్ దగ్గర వర్క్ చేసి ఇటీవల గౌతమ్ తిన్ననూరి ( కింగ్ డమ్) దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేశాడు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయబోతున్నాడని తెలుస్తోంది. రిషి ఇంతవరకు తండ్రి సినిమాల్లో వర్క్ చేసినా, ఈసారి వేరే స్ట్రాంగ్ జోన్ లోకి అడుగుపెడుతున్నాడు. వంగా లాంటి ఇంటెన్స్ డైరెక్టర్ దగ్గర అనుభవం సంపాదించడం, రిషి కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.
ఇక ఈ రోజు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న మరో షాకింగ్ గాసిప్ ఏమిటంటే.. త్రివిక్రమ్ కొడుకు రిషి దర్శకత్వం వహించే డెబ్యూట్ సినిమాకి అఖిరా నందన్ హీరోగా నటించనున్నాడట. అఖిరా సినిమాతో ఎంట్రీ ఇస్తాడనే విషయం అందరికీ తెలిసిందే, కానీ త్రివిక్రమ్ తన కొడుకు ద్వారా ఆ లాంచ్ ప్లాన్ చేస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ బలంగా వినిపిస్తోంది.
ఇలాంటి గాసిప్స్ చాలా వస్తాయి. కానీ, త్రివిక్రమ్ - అఖిరా - రిషి కాంబినేషన్ పై వస్తున్న ఈ వార్త సాధారణం కాదు. ఒకవేళ ఇది నిజం అయితే, పవన్ అభిమానులకు ఇదొక పెద్ద ట్రీట్ అని చెప్పాలి. త్రివిక్రమ్ కొడుకు దర్శకత్వంలో అఖిరా హీరోగా ఎంట్రీ ఇస్తే, ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మొత్తానికి ఈ గాసిప్ నిజమా? వదంతా మాత్రమేనా? అనేది సమయం చెప్పాలి. కానీ, ఒకే కుటుంబానికి చెందిన రెండు వారసులు కలిసి ఇండస్ట్రీలో స్టెప్ వేస్తే, అది పెద్ద హైలైట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే ఈ టాక్ పై క్లారిటీ రావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.