ఆ డైరెక్టర్ తో రజినీ.. వద్దే వద్దంటున్న ఫ్యాన్స్!
రజినీకాంత్ కు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్.. రీసెంట్ గా ఓ కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది. తన స్టోరీతో సూపర్ స్టార్ ను ఆకట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఏడు పదుల వయసులో కూడా నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ రాణిస్తున్నారు. ఒక్క సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీని అనౌన్స్ చేస్తున్నారు. మరిన్ని చిత్రాలు లైన్ లో పెట్టేస్తున్నారు.
ఇప్పుడు కూలీ మూవీని రజినీకాంత్ పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ మూవీ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో ఆయన చేతిలో జైలర్ -2 ఉంది. రీసెంట్ గా అనౌన్స్మెంట్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వార్త వైరల్ అవుతోంది.
రజినీకాంత్ కు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్.. రీసెంట్ గా ఓ కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది. తన స్టోరీతో సూపర్ స్టార్ ను ఆకట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. జైలర్ 2 తర్వాత ఆ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఇప్పుడు కొందరు తలైవా ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు. రజినీకాంత్.. వెట్రిమారన్ తో మూవీ చేయడం కరెక్ట్ కాదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఓకే చెప్పొద్దని అంటున్నారు. తమ కామెంట్స్ కు ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నారు. వెట్రిమారన్, రంజిత్ పా వంటి దర్శకులు.. తమ ప్రోపగాండాను సినిమాల్లో చూపిస్తారని అంటున్నారు.
అలాంటి వాటి వల్ల రజినీకాంత్ కు ఎలాంటి లాభం ఉండదని చెబుతున్నారు. పా రంజిత్‌తో కలిసి కాలా, కబాలి వంటి రెండు సినిమాల్లో రజినీ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం.. మారి సెల్వరాజ్ తో రజినీ మూవీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెట్రిమారన్ తో వర్క్ చేస్తారని వార్తలు రావడంతో అలా చేయొద్దని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. అది నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.