'చావా' వివాదం: న‌లుగురు వీకీ ఎడిట‌ర్ల‌పై సైబ‌ర్ కేసు న‌మోదు

శంభాజీ జీవిత‌క‌థ‌తో తీసిన బాలీవుడ్ చిత్రం `చావా` విడుదలై గ్రాండ్ స‌క్సెసైన నేప‌థ్యంలో చ‌రిత్ర‌కారుడి క‌థ‌ను వీకీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త్ర‌తంగా చ‌దువుతున్నారు.

Update: 2025-02-21 16:15 GMT

ఛత్రపతి వార‌సుడు శంభాజీ మహారాజ్ గురించి `అభ్యంతరకర కంటెంట్‌`ను ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా అయిన వీకీ పిడియా నుండి తొలగించడంలో విఫలమైనందున‌ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు వికీపీడియా ఎడిటర్లపై కేసు నమోదు చేదు చేసారు. పోలీస్ అధికారులు స్వయంగా దీనిని ధృవీకరించారు. వికీపీడియా వెనుక ఉన్న లాభాపేక్షలేని సంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు రాష్ట్ర సైబర్ ఏజెన్సీ గతంలో నోటీసు జారీ చేసి, వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలని కోరింది. ఈ కేసులో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్ ప్ర‌మేయంతో దర్యాప్తు వేగంగా సాగుతోంది.

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ భారతదేశంలో అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నందున వీకీలో షేర్ చేసిన‌ సమాచారంలో త‌ప్పులున్నాయ‌ని, ప్ర‌జ‌ల్లో అశాంతిని రేకెత్తించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. వీకీలో న‌మ్మ‌ద‌గిన విష‌యాల కంటే రెచ్చ‌గొట్టేవే ఉన్నాయి. ఇది మత సామరస్యాన్ని దెబ్బ తీస్తుంది. ఆందోళనలను లేవనెత్తుతుంది. ఈ రకమైన తప్పుడు సమాచారం శాంతిభద్రతలకు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని, వికీపీడియాలో ప్ర‌చురించిన‌ విషయానికి బాధ్యత వహించే ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చ‌ట్టం చెబుతోంద‌ని మహారాష్ట్ర సైబర్ సెల్ పేర్కొంది.

అధికారికంగా కోరినా కానీ, వివాదాస్పద కంటెంట్ తొలగింపున‌కు సంబంధించి వికీమీడియా ఫౌండేషన్ నుండి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో కేసు మ‌రో మలుపు తిరిగింది. వికీపీడియా ఎడిటర్లపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సంబంధిత విభాగాల కింద మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసింది.

శంభాజీ జీవిత‌క‌థ‌తో తీసిన బాలీవుడ్ చిత్రం `చావా` విడుదలై గ్రాండ్ స‌క్సెసైన నేప‌థ్యంలో చ‌రిత్ర‌కారుడి క‌థ‌ను వీకీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త్ర‌తంగా చ‌దువుతున్నారు. దీంతో చ‌రిత్రను వ‌క్రీక‌రించి రాసిన లైన్ల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ ఊపందుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైబర్ ఏజెన్సీని అధికారికంగా వికీపీడియాను సంప్రదించి వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేయాలని ఆదేశించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) - భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌)లోని సెక్షన్ 168 కింద నోటీసు పంప‌గా వీకీలో కంటెంట్ తప్పుదారి పట్టించేదిగా ఉందని శాంతి భ‌ద్ర‌త‌ల‌కు స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఇటీవ‌ల అధికారికంగా వీకీ పిడియా కార్యాలయానికి నోటీసులు పంపినా వారు స్పందించ‌క‌పోవ‌డంతో ఇరు వ‌ర్గాల న‌డుమ‌ ప‌రిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి.

Tags:    

Similar News