బాలకృష్ణ 'డాకు మహారాజ్‌' @ నెంబర్‌.1

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొంది గత నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2025-02-22 06:52 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొంది గత నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద డాకు మహారాజ్‌ సినిమా రూ.150 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణ వరుసగా నాల్గవ విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకుని డబుల్‌ హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు తమన్‌ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో పలు యాక్షన్‌ సన్నివేశాల స్థాయిని తమన్‌ పెంచాడు. బాలకృష్ణతో వరుసగా నాల్గవ విజయాన్ని తమన్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓటీటీలో డాకు మహారాజ్ సందడి కొనసాగుతోంది.


థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు డాకు మహారాజ్ సిద్ధం అయ్యాడు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్‌ కావడం మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, ఇతర సౌత్ భాషల్లోనూ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు డాకు మహారాజ్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ను రాబట్టిన సినిమాగా నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ సినిమా నిలిచింది. ఇక ఇండియాలో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాగా కూడా డాకు మహారాజ్ సినిమా నిలిచింది.

డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసినట్లుగానే ఓటీటీలోనూ అందరి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు డాకు మహారాజ్‌ సినిమాను ఆధరిస్తున్నారు. దాంతో హిందీ సినిమాలను పక్కకు నెట్టి నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో నెం.1 స్థానంలో నిలిచింది. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో ఈ సినిమాకు వ్యూస్ లభిస్తున్నాయని నెట్‌ఫ్లిక్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు అదిరి పోయే మ్యూజిక్‌ ఉండటంతో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఊర్వశి రౌతేలాతో చేసిన సీన్స్‌, దబిడి దిబిడి సాంగ్‌కి నార్త్‌ ఇండియన్‌ సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో దక్కుతున్న స్పందనకి సంతోషం వ్యక్తం చేస్తూ సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు బాబీ ట్వీట్స్‌ చేశారు.

బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్ పై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మంచి లాభాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా ముఖ్య పాత్రల్లో శ్రద్దా శ్రీనాథ్‌, ఊర్వశి రౌతేలా నటించారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. యానిమల్‌ సినిమాలో మాదిరిగానే చాలా స్టైలిష్‌ గా బాబీ డియోల్‌ డాకు మహారాజ్‌లో కనిపించారు.

Tags:    

Similar News