ఆమెపై కేసు నమోదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కారణం
ఇటీవల ఈమె సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పండుగల గురించి ప్రస్థావన వచ్చిన సమయంలో హోలీ పండుగ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ సినిమాల గురించి కొంత అవగాహణ ఉన్న వారికి సైతం ఫరా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుదీర్ఘ కాలంగా ఈమె ఇండస్ట్రీలో ఉంటున్నారు. కొరియోగ్రాఫర్‌గా ఎన్నో పాటలు చేసిన ఫరా ఖాన్ ఆ తర్వాత దర్శక నిర్మాతగానూ సినిమాలు చేసింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరపైనా ఈమె సందడి చేస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా ఏదో ఒక గేమ్ షో, రియాల్టీ షో ల్లో ఫరా ఖాన్ కనిపిస్తూ ఉంటారు. ఇటీవల ఈమె సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పండుగల గురించి ప్రస్థావన వచ్చిన సమయంలో హోలీ పండుగ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఇండియాలో హోలీ పండుగను ఎక్కువగా చాఫ్రీ ప్రజలు జరుపుకుంటారు. వారికి మాత్రమే హోలీ పండుగ ఇష్టం అన్నట్లు వ్యాఖ్యలు చేసింది. చాఫ్రీ అనే పదంను ఇండియాలో అవమానకరంగా దూషించే సమయంలో వినియోగిస్తారు. ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే సమయంలో అలాంటి పదాలను వినియోగిస్తారు. గౌరవం లేని వారు, అర్హత లేని వారిని చాఫ్రీ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి వారు మాత్రమే హోలీ ఆడుతారు అంటూ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. ఒక మతంకు చెందిన వారు ఎంతో పవిత్రంగా హోలీని భావిస్తారు. అలాంటి పండుగను మీరు ఎలా చాఫ్రీ వాళ్ల పండుగా అంటారు అంటూ ఫరా ఖాన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఫరా ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆమెపై వివాదాస్పద ట్వీట్‌లు చేస్తూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా వికాశ్ అనే వ్యక్తి ఖర్ పోలీస్ స్టేషన్లో ఫరా ఖాన్‌పై ఫిర్యాదు చేశాడు. ఆమె చేసిన వ్యాఖ్యలు మతపరమైన భావనలను గాయపరిచే విధంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురి అయ్యాను. మొత్తం హిందూ సమాజంను ఆమె అవమానించే విధంగా మాట్లాడింది అంటూ వికాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వికాస్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫరా ఖాన్ ఎలా స్పందిస్తారా అనేది చూడాలి.
2007 సంవత్సరంలో ఓం శాంతి ఓం సినిమాతో దర్శకురాలిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో దీపికా పదుకొనేను బాలీవుడ్‌కి ఫరా ఖాన్ పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఫరా ఖాన్ గురించి దేశం మొత్తం చర్చించుకోవడం మొదలు అయింది. దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగానూ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసిన ఫరా ఖాన్ ఎక్కువగా బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ శాతం రియాల్టీ షోలు, గేమ్ షోల్లో ఫరా ఖాన్ కనిపిస్తూ ఉంటారు. తాజా వివాదం కారణంగా ఆమె వార్తల్లో నిలిచారు. విమర్శలపై ఫరా ఖాన్ స్పందిస్తారా.. క్షమాపణలతో ఈ వివాదాన్ని ముగిస్తారా అనేది చూడాలి.