ముద్దు, రొమాంటిక్ సీన్స్‌కి ఆయన దూరం.. ఎందుకంటే!

ఎంతటి యాక్షన్ సీన్స్ అయినా చేసేందుకు ఓకే చెప్ప ఉన్ని ముకుందన్ రొమాంటిక్ సీన్స్‌కు మాత్రం నో అంటాడు.

Update: 2025-02-21 16:30 GMT

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ తాజాగా 'మార్కో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ సినీ చరిత్రలో విభిన్నమైన సినిమాగా మార్కో నిలిచింది. ఒక 'ఎ' సర్టిఫికెట్‌ మూవీ మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రూ.100 కోట్లు రాబట్టడం మార్కో సినిమాకే చెల్లింది. మార్కో సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు మరో కేజీఎఫ్‌, మరో సలార్‌ అనే స్థాయిలో ఉన్నాయంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న ఉన్ని ముకుందన్‌కి ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ హిట్‌ పడిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతటి యాక్షన్ సీన్స్ అయినా చేసేందుకు ఓకే చెప్ప ఉన్ని ముకుందన్ రొమాంటిక్ సీన్స్‌కు మాత్రం నో అంటాడు.

ఉన్ని ముకుందన్‌ తన సినీ కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి ముద్దు సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్‌లో, ఇంటిమేట్‌ సీన్స్‌లో కనిపించలేదు. ఆయన హీరోగా నటించినా, విలన్‌గా చేసినా కూడా అలాంటి సీన్స్‌కి మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. పలువురు దర్శక నిర్మాతలు ముద్దు సన్నివేశాలు చేయమని, కొందరు ఇంటిమేట్‌ సన్నివేశాలు చేయమని ఒత్తడి చేశారట. అయినా కూడా ఉన్ని ముకుందన్‌ మాత్రం తాను కట్టుబడి ఉన్న పద్దతిని మార్చుకోలేదు. ఇతర హీరోలు ఎంతో మంది అలాంటి సీన్స్ చేసినా నేను మాత్రం అలాంటివి చేయను అంటూ తేల్చి చెప్పిన ఘనత కేవలం ఉన్ని ముకుందన్‌కి చెల్లింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి ఉన్ని ముకుందన్‌ స్పందించాడు. కెరీర్‌ ఆరంభం నుంచి తాను అలాంటి సీన్స్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో అడుగు పెట్టే సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు అయినా ఆ నిర్ణయాన్ని మార్చుకోకూడదు అనుకున్నాను. అనుకున్నట్లుగానే నేను ఆ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎప్పుడు ముద్దు సీన్‌లో కానీ, రొమాంటిక్ సీన్స్‌లో నటించలేదు. ఆ సీన్స్‌ కోసం కొన్ని సార్లు కొందరు ఒత్తిడి చేసినా నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోలేదు అన్నాడు.

సినిమాల్లో భార్య భర్తల మధ్య ప్రేమను చూపించడం, లవర్స్ మధ్య ఉన్న ప్రేమను చూపించడానికి ముద్దు ఒక్కటే మార్గం కాదని, రొమాంటిక్ సీన్స్ చేయడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపించడంను తాను వ్యతిరేకిస్తాను అన్నాడు. అలా చెప్పడం వల్ల కొన్ని సినిమా ఆఫర్లు పోయాయి అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇతర హీరోలు చేస్తున్నదాన్ని నేను తప్పు పట్టడం లేదు. నా పద్దతిని నేను కొనసాగిస్తున్నాను. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అంతే తప్ప ఇందులో ఎవరిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఉన్ని ముకుందన్‌ అన్నాడు. భవిష్యత్తులో తాను చేయబోతున్న సినిమాల్లోనూ అలాంటి సీన్స్ ఉండవని బలంగా బల్లగుద్ది మరీ చెప్పాడు.

Tags:    

Similar News