టాలీవుడ్ లో ఊహించని ప్రయోగం!
అయితే అలాంటి ముఖాలే చూపించకుండా సినిమా ఎవరైనా తీస్తారా? అంటే నేను తీసాను మీరు చూడండి యువ డైరెక్టర్ బి. శివప్రసాద్.
సినిమా అంటే అందమైన తారల సమూహంతో కూడినది. ఏ పాత్ర ఎలా ఉంటుంది? అన్నది తెలిసేది కేవలం ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ తోనే. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా? ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రం కచ్చితంగా క్యారీ చేయాల్సిందే. అప్పుడే ఆ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే అలాంటి ముఖాలే చూపించకుండా సినిమా ఎవరైనా తీస్తారా? అంటే నేను తీసాను మీరు చూడండి అంటున్న యువ డైరెక్టర్ బి. శివప్రసాద్.
ఆయన రా రాజా' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీ పద్మిని సినిమాస్ పతాకం నిర్మించింది. మార్చి 7న రిలీజ్ అవుతున్న చిత్రం రిలీజ్ తేదీ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు చెప్పిన విషయాలు తెలిస్తే విస్తు పోవాల్సిందే. నటీనటుల ముఖాలు చూపించకుండా కేవలం కథే ప్రధానంగా సాగే చిత్రం అంటున్నారు. `టైటిల్ చూసి ప్రేమ కథ అనుకుంటారు. కానీ సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.
నిజంగా ఇది పెద్ద ప్రయోగం. ఇది విజయవంతమైతే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లు లేకుండా సినిమాలు చేయోచ్చు అంటున్నారాయన. ఆయన అన్నట్లు ఇది చాలా పెద్ద ప్రయోగమే. ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చేసి ఉండరు. అది ఈయనే కావొచ్చు. మూఖి సినిమా చూసాం. సంభాషణలు లేని చిత్రాలు చూసాం.
కానీ ఇలా ముఖాలు లేని సినిమా చూడటం ఇదే తొలిసారి. మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? ఫెయిలవుతుందా? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. సక్సెస్ అయితే మంచి పేరొస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. పెయిలైతే మాత్రం నెట్టింట విమర్శలు, ట్రోలింగ్ తప్పదు. అన్ని రకాలుగా యూనిట్ సిద్దమవ్వాల్సిందే.