'అనగనగా ఒక రాజు' ఎప్పుడు వస్తున్నాడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో నవీన్ పోలిశెట్టి పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

Update: 2025-02-19 23:30 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో నవీన్ పోలిశెట్టి పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగ్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆయన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. కానీ స్క్రీన్ పై కనిపించి లాంగ్ గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే.

చివరగా అనుష్క హీరోయిన్ గా యాక్ట్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

వాస్తవానికి.. అనగనగా ఒక రాజు మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలం అయింది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక మూవీ ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల సినిమాను మళ్లీ స్టార్ట్ చేసినట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. నవీన్.. ఆ మధ్య ప్రమాదానికి గురై కోలుకుని మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టారు.

కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. మేకర్స్ గతంలో ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. లాంగ్ గ్యాప్ తర్వాత టీజర్ ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు.

ప్రీ వెడ్డింగ్ వీడియో పేరుతో వచ్చిన టీజర్ తో నవీన్ ఓ రేంజ్ లో అలరించారు. తన కామెడీ టైమింగ్ తో మెప్పించారు. దీంతో టీజర్ తో సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా డిజిటల్ రైట్స్ డీల్ కూడా ఫిక్స్ అయింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. మరి అనగనగా ఒక రాజు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News