అడిగినంత ఇస్తానన్నా అమ్మడు కాదంటోందట..!
ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటున్న తెలుగు సినిమాల మీద కన్నేశారు.
ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటున్న తెలుగు సినిమాల మీద కన్నేశారు. సౌత్ నుంచి ప్రత్యేకంగా టాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే మాత్రం ఓకే అనేస్తున్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ సంగతి కూడా అలానే ఉంది. ఒకప్పుడు అంటే సౌత్ హీరోయిన్స్ కన్నా నార్త్ హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది కానీ పాన్ ఇండియా ప్రభావం వల్ల నటీనటుల రెమ్యునరేషన్స్ అక్కడ ఇక్కడ ఒకే రకంగా ఉన్నాయి. మన స్టార్స్ అయితే హిందీ స్టార్స్ కూడా తీసుకోని రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్ లో అలియా, దీపికా, జాన్వి ఇలా అందరు ప్రస్తుతం తెలుగు సినిమాలు చేస్తున్నారు. వారిలో కియరా అద్వాని అయితే ఆల్రెడీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేశాయి. అయితే హిందీలో వరుస సినిమాలు చేస్తున్న కియరా తెలుగులో ఆఫర్లు వస్తున్నా చేయలేని పరిస్థితి అని అంటున్నారు.
ఆల్రెడీ కియరా రాం చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది కియరా. ఈ సినిమా హిట్ పడితే టాలీవుడ్ లో అమ్మడి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. కియరా మాత్రం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు వైపులా కవర్ చేస్తుంది. లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ టైం నుంచి కియరా ఫేట్ మారిపోయింది. అమ్మడు ఏ సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవడంతో బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అయ్యింది.
రీసెంట్ గా సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన కియరా గేమ్ చేంజర్ తర్వాత రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానని చెప్పినా సరే కాదని అంటుందట. ప్రస్తుతం సినిమాకు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ అమ్మడు తెలుగు సినిమాలు చేయాలంటే మాత్రం 4 నుంచి 5 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. మరి కియరానే కావాలని అనుకుంటే అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. చరణ్ తో రెండోసారి జత కడుతున్న కియరా ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమాలే కాదు కియరా క్రేజీ ఫోటో షూట్స్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని మాయ చేస్తుంది అమ్మడు.