తమన్నాకి ఆ బాధ ఏం లేదా?
సెలబ్రెటీ లైఫ్ స్టైల్‌ను గమనించే పలువురు మీడియా వారు సైతం తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్‌ను దృవీకరించారు.;
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల బ్రేకప్ వార్తలతో ఎక్కువగా మీడియాలో నిలిచిన విషయం తెల్సిందే. దాదాపు రెండేళ్ల పాటు నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా ఇటీవల విడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. వివాహం విషయంలో ఇద్దరి మధ్య భిన్న అభిప్రాయాల కారణంగా విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. అసలు విషయం ఏంటి అనేది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఇద్దరూ మొన్నటి వరకు ప్రేమలో ఉన్న విషయం నిజం, ఇటీవల బ్రేకప్ అయిన మాట వాస్తవం అంటూ జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. సెలబ్రెటీ లైఫ్ స్టైల్‌ను గమనించే పలువురు మీడియా వారు సైతం తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్‌ను దృవీకరించారు.
బ్రేకప్ వార్తలపై తమన్నా, విజయ్ వర్మలు స్పందించలేదు. ప్రస్తుతం ఇద్దరి సన్నిహితులు వీరిని మళ్లీ కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇటీవల ఒక సెలబ్రిటీ నిర్వహించిన హోలీ వేడుకలో విడి విడిగా హాజరు అయ్యారు. ఇద్దరి మధ్య మొహం మొహం చూపించుకోలేనంత గొడవలు జరగలేదని, కనుక ప్యాచప్‌కి అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇదే సమయంలో తమన్నా ఏమాత్రం బాధ లేకుండా వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతూ వస్తోంది. సాధారణంగా బ్రేకప్ కారణంగా హీరోయిన్స్ కాస్త డిప్రెషన్‌కి గురి అవుతారు. కనీసం ఆరు నెలల పాటు కొత్త ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపించరని టాక్ ఉంది. కానీ తమన్నా మాత్రం ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో కొత్త సినిమాకు తమన్నా ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. తమన్నా ఇప్పటికే పలు హిందీ సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా మరింత కాలం కొనసాగడం కోసం తమన్నా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కమిట్ అవుతూ వస్తోంది. అజయ్ దేవగన్ సినిమాకు ఇటీవలే ఓకే చెప్పింది. బ్రేకప్ అయి కొన్ని వారాలు కూడా కాకుండానే కొత్త సినిమాకు ఓకే చెప్పిన తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రేకప్ బాధ పెద్దగా మనసులో పెట్టుకోకుండా తమన్నా నార్మల్‌గానే తన కెరీర్‌లో ముందుకు వెళ్తుంది. పైగా బ్రేకప్ తర్వాత కెరీర్ విషయంలో మరింత సీరియస్‌గా తమన్నా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగులో తమన్నా ప్రస్తుతం ఓదెల 2 సినిమాలో నటిస్తోంది. గత సంవత్సరం పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ఈ సారి మాత్రం ఓదెల 2 మాత్రమే ఇప్పటి వరకు చేస్తుంది. ఇటీవల అజయ్ దేవగన్ సినిమాకు కమిట్ అయింది. మరో వైపు వెబ్ సిరీస్ కి సంబంధించిన చర్చలు సైతం జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. మొత్తానికి విజయ్ వర్మ తో బ్రేకప్ విషయంలో తమన్నా తెగ ఇబ్బంది పడి పోకుండా కెరీర్ పరంగా సాఫీగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కొందరు బ్రేకప్ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి కెరీర్‌ను నాశనం చేసుకుంటారు. కానీ తమన్నా మాత్రం అలా చేయకుండా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందని ఆమె సన్నిహితులు అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.