సాక్షి ఖాతాలో ఇన్ని ఎలా సాధ్యం?

తాజాగా ఈ సినిమాలో దుల్క‌ర్ కి జోడీగా యంగ్ బ్యూటీ సాక్షి వైద్య‌ని ఎంపిక చేసారు

Update: 2023-08-02 06:58 GMT

మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ టాలీవుడ్ లో దూకుడు పెంచుతోన్న సంగ‌తి తెలిసిందే. 'సీతారామం' విజ‌యం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా... ఇన్నోవేటివ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికే ఈ గ్యాప్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే వ‌రుస‌గా రెండు ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'ల‌క్కీ భాస్క‌ర్' అనే సినిమాకి క‌మిట్ అయ్యాడు. దీంతో పాటు రానా నిర్మాణంలో 'కాంత' సినిమాకి సైన్ చేసాడు.

ఈ రెండు సినిమాలు ఏక కాలంలో సెట్స్ కి వెళ్తాయా? ఒక దాన్ని పూర్తిచేసిన త‌ర్వాత మ‌రోక‌టి వెళ్తుందా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ల‌క్కీ భాస్క‌ర్ ప‌నులు మాత్రం వేగంగా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో దుల్క‌ర్ కి జోడీగా యంగ్ బ్యూటీ సాక్షి వైద్య‌ని ఎంపిక చేసారు. దీంతో సాక్షి పేరు మ‌రోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మ‌డు ఏజెంట్ సినిమాతో ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా వైఫ‌ల్యం త‌ర్వాత టాలీవుడ్ లో క‌నిపిస్తుందా? అని డౌట్ రెయిజ్ అయింది. కానీ ప్లాప్ తో సంబంధం లేకుండా వ‌రుస‌గా కొత్త సినిమాలు షురూ చేస్తోందీ భామ‌. ఇప్ప‌టికే సాయితేజ్ తో ఓ సినిమా..మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తో మ‌రో సినిమాకి సైన్ చేసింది. ఈ రెండింటి త‌ర్వాత వెంట‌నే దుల్క‌ర్ సినిమాలోనూ లాక్ అవ్వ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచే విష‌య‌మే. అంత‌కు ముందే వ‌రుణ్ తేజ్ 'గాండీవ‌ధారి అర్జున‌'కి సైన్ చేసింది.

ప్ర‌స్తుతం ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సక్సెస్ లేకుండా ఇలా వ‌రుస‌గా ఛాన్సులు అందుకోవ‌డం అంత వీజీ కాదు. ఎక్క‌డో సుడి ఉంటే త‌ప్ప ఇలా జ‌ర‌గ‌దు. ఆర‌కంగా ఏజెంట్ బ్యూటీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం లైనప్ లో ఉన్న సినిమాలు విజ‌యాలు అందుకుంటే సాక్షి స్టార్ లీగ్ లో చేర‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌ద‌నిపిస్తోంది. అలాగే టాలీవుడ్ లో కూడా క‌ల్చ‌ర్ మారిన‌ట్లు క‌నిపిస్తోంది. కొత్త భామ‌ల్ని ఎంక‌రేజ్ చేసే ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు పెరిగారు. గ‌త ట్రాక్ చూడ‌కుండా అందం..అభిన‌యం గ‌ల నాయిక అయితే అవ‌కాశాలివ్వ‌డానికి ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. ఆ కోవ‌లోనే సాక్షి ఛాన్సులందుకుంటుంది.

Tags:    

Similar News