అన‌న్య‌-ఆదిత్య విడిపోయినా క‌లిసే..!

ఇప్పుడు ఇదే జాబితాలో మ‌రో జంట కూడా చేరింది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవ‌లే విడిపోయింది.

Update: 2024-09-01 07:30 GMT

బాలీవుడ్ లో విడిపోయినా క‌లిసి ఉండే జంట‌లు పెరుగుతున్నారు. హృతిక్ రోష‌న్-సుసానే ఖాన్, మ‌లైకా- అర్జున్ క‌పూర్, టైగ‌ర్ ష్రాఫ్‌- దిశా ప‌టానీ .. ఇలా జంట‌లు విడిపోయి చాలా కాల‌మే అయినా ఇంకా క‌లిసే ఉంటున్నారు. వారి మ‌ధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి.

ఇప్పుడు ఇదే జాబితాలో మ‌రో జంట కూడా చేరింది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవ‌లే విడిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి క‌లుసుకుంది. విడిపోయిన నెలల తర్వాత ఒక వాణిజ్య ప్రకటన లో అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ క‌లిసి న‌టించారు. ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్న కొన్ని ఫోటోలను చూపిస్తూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మాజీ క‌పుల్ కొత్త కళ్లజోళ్ల వాణిజ్య ప్రకటనలో తమ కెమిస్ట్రీతో అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. గ‌త మేలో విడిపోయినప్పటికీ ఈ జంట‌ ఆన్-స్క్రీన్ ఇంటరాక్షన్ ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. ఇరువురు మొదటిసారిగా 2022లో క‌లుసుకున్నారు. అటుపై తరచుగా కలిసి కనిపించారు. విదేశీ షికార్ల కార‌ణంగాను వార్త‌ల్లో నిలిచారు. కానీ ఇటీవ‌లే మాజీలు అయ్యారు. దీనికి కార‌ణాలు ఎవ‌రూ చెప్ప‌లేదు. కానీ ఇంకా స్నేహంగానే ఉంటున్నారు.

ప్ర‌స్తుతం రివీలైన ప్ర‌క‌ట‌న‌లో అనన్య -ఆదిత్యల కెమిస్ట్రీకి అభిమానులు థ్రిల్ అయ్యారు. దీనికి అభిమానులు స్పందిస్తున్నారు.``వావ్, వారు ఇంకా కలిసి ఉన్నారని చూడటం చాలా బాగుంది! అని ఒక‌రు వ్యాఖ్యానించారు. మరొకరు వారు కలిసి సంతోషంగా ఉన్నారు అని అన్నారు. బాలీవుడ్‌లో హాటెస్ట్ కపుల్ #ఆదిన్యా .. అద్భుతంగా కనిపిస్తున్నారు అంటూ మ‌రొక వ్య‌క్తి వ్యాఖ్యానించారు.

గ‌త మేలో ఆదిత్య- అనన్య మార్చిలో తమ డేటింగ్ ని ముగించార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆద‌ర్శ‌ జంట బాగానే ఉన్నట్లు కనిపించడంతో విడిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. విడిపోయినప్పటికీ వారు స్నేహంగా ఉన్నారు. అనన్య త‌న ప‌నిలో తాను ముందుకు సాగడం, కొత్త పెంపుడు జంతువుతో సమయం గడపడంపై దృష్టి పెట్టింది. ఆదిత్య పరిపక్వతతో పరిస్థితిని మేనేజ్ చేస్తున్నాడు. 2022లో కృతి సనన్ దీపావళి పార్టీలో ఈ జంట క‌లిసి కనిపించిన తర్వాత వారి సంబంధం గురించి పుకార్లు మొదలయ్యాయి. ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ కూడా తన టాక్ షోలో వారి సంబంధం గురించి ప్ర‌స్థావించాడు. తరువాత వారు విమానాశ్రయాలలో ఎక్కువ‌గా క‌లిసే క‌నిపించారు. విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లారు. అనన్య న‌టించిన‌ వెబ్ సిరీస్ `కాల్ మీ బే` త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌స్తుతం ప్రమోషన్‌లతో అన‌న్య బిజీగా ఉంది.

Tags:    

Similar News