రెండేళ్ల తర్వాత ఏజెంట్ డిజిటల్ రిలీజ్..!

రా ఏజెంట్ గా అఖిల్ ది బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28, 2023లో రిలీజైంది.;

Update: 2025-03-05 12:16 GMT

అక్కినేని హీరో అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో 2023 సమ్మర్ లో రిలీజైన సినిమా ఏజెంట్. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. రా ఏజెంట్ గా అఖిల్ ది బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28, 2023లో రిలీజైంది.

సినిమాపై భారీ అంచనాలు ఉండటమే కాకుండా అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత వచ్చిన సినిమాగా క్రేజ్ తెచ్చుకుంది. ఐతే ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. రా ఏజెంట్ కథను కమర్షియల్ యాక్షన్ గా మార్చి తీశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి అందుకే ఈ సినిమా ఆడియన్స్ కు సరిగా ఎక్కలేదు.

ఏజెంట్ సినిమాలో అఖిల్ ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే తగిన ఫలితాన్ని తెచ్చుకోలేకపోయాడు. ఐతే అఖిల్ ఏజెంట్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది కానీ ఇప్పటివరకు డిజిటల్ రిలీజ్ కు నోచుకోలేదు. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఫైనల్ గా ఈ సినిమా మార్చి 14న డిజిటల్ రిలీజ్ లాక్ చేశారు.

అఖిల్ ఏజెంట్ సినిమా హోలీ సందర్భంగా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా చేయగా సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు. ఏజెంట్ సినిమా స్టైలిష్ యాక్షన్ మూవీ కాగా థియేట్రికల్ వెర్షన్ వర్క్ అవుట్ కాలేదు మరి కనీసం డిజిటల్ రిలీజ్ తో అయినా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఏజెంట్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండగా అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈసారి భారీ బడ్జెట్ తో పీరియాడికల్ కథతో వస్తాడని వార్తలు వస్తున్నా కూడా వాటిల్లో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఏజెంట్ డిజిటల్ రిలీజ్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందా అన్నది చూడాలి.

Tags:    

Similar News