ఎంపీ పదవి అడుక్కోమంటావా? అన్నారు ఎన్నార్!
ఆ సభ్యత్వాన్ని ఏఎన్నార్ కొద్దిలో కోల్పోవాల్సి వచ్చిందని దర్శ-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
అక్కినేని కుటుంబం సినిమా తప్ప! రాజకీయాల్లో ఏనాడు లేదు. ఏఎన్నార్ నుంచి ఆ తర్వాత తరం నటులెవరూ కూడా అటువైపు గా ప్రయత్నాలు చేసింది లేదు. సినిమా.. ఇతర వ్యాపారం.. ప్రశాంతమైన జీవితం తప్ప! రాజకీయం అనే ముద్ర ఆ కుటుంబీకులు ఎవరూ వేసుకోలేదు. ఏఎన్నార్ సమకాలీకుడు నటసార్వభౌమ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించినా..ఏఎన్నార్ మనసు మాత్రం ఏ నాడు రాజకీయ పదవులు కోరుకోలేదు. ఆయన కనీసం ఆలోచన కూడా చేయలేదు.
అదే మార్గంలో తర్వాత తరం నటులు కొనసాగుతున్నారు. అయితే పెదవి ఏఎన్నార్ కోరుకోకపోయినా! తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ గుర్తించి ఆయన్ని రాజ్యసభ ఎంపీ చేయాలని కొందరు సీరియస్ గానే ప్రయత్నాలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సభ్యత్వాన్ని ఏఎన్నార్ కొద్దిలో కోల్పోవాల్సి వచ్చిందని దర్శ-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన అలా స్పందించారు. 'ఏఎన్నార్ కి ఎంపీక కావాలని ఆయనకు లేకపోయినా..మేము మాత్రం సీరియస్ గానే ప్రయత్నాలు చేసాం. ఆయన రాజ్య సభకి వెళ్తే బాగుంటుందని నాతో పాటు మరికొంత మంది కోరుకున్నాం.
ఈ విషయాన్ని ఏఎన్నార్ కి ఓ సందర్భంలో చెప్పాను. దానికి ఆయన సీరియస్ గా చూసి తనదైన శైలిలో అంటే ఇప్పుడు నేను అడుక్కుని ఎంపీ అవాలంటావా? అని అన్నారు. ఆ విషయంలో నేను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే! నేను ఏపదవి అడుక్కుని తెచ్చుకోవాల్సిన పనిలేదన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తరుచూ కలిసేవాడిని. ఆయన్ని కూడా అడిగాను. అప్పుడు ప్రధాని గుజ్రాల్ . చంద్రబాబు ఎన్టీయేలో భాగస్వామ్యం. ఆయన ఏం చెప్పినా చెల్లుతుంది. కానీ అప్పటికే ఆ పదవికి షబానా ఆజ్మీకి మాట ఇచ్చారని..ఒకేసారి ఇద్దరు నటులకు రాజ్యసభకి నామినేట్ చేయడం వీలుపడదని...అడగడం బాగోదని చంద్రబాబు చెప్పారు' అని అన్నారు.