1250 కోతుల ఆకలి తీర్చిన స్టార్..!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన టీం తో కలిసి కోతులకు ఆహారాన్ని అందించాడు.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అవసరమైనప్పుడు తన మంచి హృదయం చాటుకుని తన అభిమానులకు ప్రేక్షకులకు స్పూర్తిగా నిలవాలని చూస్తారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు వారి మంచి మనసుని ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ లో ఇలా ప్రత్యేకమైన పనులతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వారిలో అక్కీ భాయ్ ఒకడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన టీం తో కలిసి కోతులకు ఆహారాన్ని అందించాడు. అంతేకాదు కౌ వ్యర్ధాలతో పర్యావరణ సంరక్షణకు తోడ్పడేలా చేస్తున్నారు.
అయోధ్య లో అక్షయ్ కుమార్ చేసిన సేవా కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఆయన తన టీం తో కలిసి అయోధ్య లో కోతులకు ఫీడింగ్ అందించారు. ఒకటి రెండు కాదు ఏకంగా 1250 కోతులకు కావాల్సిన అవసరమైన పండ్లు, కూరగాయలు మిగతా ఫీడింగ్ అందించారు. తన టీం తో కలిసి చేసిన పనికి అక్షయ్ కుమార్ ని తన ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు అయోధ్య పరిసరాలు శుభ్రంగా ఉండేలా కూడా ఆయన తన టీం తో పనిచేయిస్తున్నారు.
సినిమాల పరంగా ఎంత ఎత్తుకి ఎదిగినా తమ గొప్ప మనసు చాటుకునే ఇలాంటి విషయాల వల్ల ప్రేక్షకులు ఆ హీరోని మరింత ప్రైజ్ చేస్తారు. వారు చేసే సినిమాల వల్లే కాకుండా ఇలాంటి పనుల వల్ల ఆ హీరో ఫ్యాన్స్ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. 1250 కోతుల ఆకలి తీర్చిన స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ మీద సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అక్షయ్ కుమార్ ఈ మధ్య సినిమాల పరంగా బాక్సాఫీస్ పై పెద్ద ప్రభావాన్ని చూపించట్లేదు. ఐతే తను కెరీర్ పరంగా సక్సెస్ ఫాం లో ఉన్నా లేకపోయినా తను చేయాల్సిన మంచి పనుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదన్నట్టుగా తన కైండ్ హర్ట్ చూపిస్తున్నాడు అక్షయ్ కుమార్.
అంతేకాదు స్టార్ హీరోల్లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వారిలో ఆయన ఒకరు. సనాతన ధర్మం పాటిస్తూ తన ఫ్యాన్స్ కి ఆదర్శప్రాయుడిగా ఉంటూ వస్తున్నాడు. సినిమాలు సక్సెస్ లు ఫెయిల్యూర్స్ మనిషిని కెరీర్ పరంగా ముందుకు వెనక్కి తీసుకెళ్లొచ్చేమో కానీ అక్షయ్ కుమార్ అంటే తన ఫ్యాన్స్ కి ఎప్పుడు ప్రత్యేకం అనిపించేలా ఆయన పనులు ఉంటాయి. అక్కి భాయ్ కూడా ఫ్యాన్స్ ని తన పనులతో ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు.