ప్రేమే గెలుస్తుంది అంటూ త్రిష పోస్ట్.. ఏంటీ మ్యాటర్?

ఆ ఫోటోలో ఆమె చీరలో, గజ్రా, జ్యూవెలరీతో మెరిసిపోతూ కనిపించారు. ముఖ్యంగా ఆ క్యాప్షన్‌లో గ్రీన్ హార్ట్ ఎమోజీ ఉపయోగించడాన్ని చాలామంది నెటిజన్లు పక్కాగా గమనించారు.;

Update: 2025-03-29 06:20 GMT
ప్రేమే గెలుస్తుంది అంటూ త్రిష పోస్ట్.. ఏంటీ మ్యాటర్?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరో దశకు ఎంటర్ అయినా కూడా స్టార్ హీరోయిన్ల స్టేటస్‌ను అలానే నిలబెట్టుకున్న త్రిష ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్ట్‌తో మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అందమైన ట్రెండిషనల్ లుక్‌లో కనిపిస్తూ "లవ్ ఎల్లప్పుడూ గెలిస్తుంది" అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆమె చీరలో, గజ్రా, జ్యూవెలరీతో మెరిసిపోతూ కనిపించారు. ముఖ్యంగా ఆ క్యాప్షన్‌లో గ్రీన్ హార్ట్ ఎమోజీ ఉపయోగించడాన్ని చాలామంది నెటిజన్లు పక్కాగా గమనించారు.




 


ఆ క్యాప్షన్ చూసిన తర్వాత వెంటనే సోషల్ మీడియాలో త్రిష పెళ్లిపై మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి. ఈ మాట అర్థాన్ని అందరూ తమ తరహాలో విశ్లేషించుకుంటున్నారు. ఎవరైనా స్పెషల్ పర్సన్‌ను ఆమె జీవితంలోకి ఆహ్వానించారా? లేదంటే ఇది ఓ సినిమా ప్రమోషన్‌కు భాగమా? అని అభిమానులు తమ సందేహాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు త్రిష వివాహంపై వార్తలు వచ్చాయి కానీ అవన్నీ గాసిప్‌గానే మిగిలిపోయాయి.

త్రిష ప్రస్తుతం తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌లోనూ బిజీగా ఉన్నారు. సినిమా బిజీ షెడ్యూల్‌ మధ్య ఇలా ఇంటెన్సిటీ ఉన్న క్యాప్షన్‌తో ఉన్న ఫోటో షేర్ చేయడం వెనుక ఏమైనా స్పెషల్ అర్థం ఉందా అని అభిమానులు ఊహాగానాలు చేస్తుండటం సహజమే. ఇకపోతే ఆమె ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఈ ఫోటోకు ఇప్పటికే లక్షల్లో లైక్స్ వచ్చాయి.

ఇప్పటికే నాలుగు పదుల వయసులోకి ప్రవేశించిన త్రిష, ఇంకా తన గ్లామర్, గ్రేస్‌ను మించిపోకుండా కొనసాగిస్తూ యంగ్ హీరోయిన్స్‌కు పోటీగా నిలుస్తోంది. కెరీర్‌లో మంచి హైగా ఉండే సమయంలో ఆమె పెళ్లిపై ఆసక్తి ఉండడం సహజమే. కానీ త్రిష మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఈసారి మాత్రం “Love always wins” అంటూ రాసిన క్యాప్షన్ వెనక అసలు విషయం త్వరలో బయటపడుతుందేమో చూడాలి. ఒకవేళ ఇది సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రెటీలు అలాంటి ట్విస్టులే ఇస్తున్నారు.

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే లియో సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన త్రిష వయసుకు తగ్గ పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ లో కూడా అమెనే మెయిన్ హీరోయిన్. మరి రాబోయే సినిమాలతో అమ్మడు ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News