సినిమా ఛాన్సులకు హెయిర్ కి ఉన్న సంబంధం !
తాజాగా పాత రోజుల్లో నటుడికి హెయిర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అన్నది బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా మాటల్లో తెలుసుకుందాం.
సినిమా హీరో అవ్వాలంటే మంచి ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఉండాలి అన్నది ఒకప్పటి వాస్తవం. కానీ హెయిర్ లేకపోయినా హీరో అవ్వొచ్చు అన్నది ఇప్పటి వాస్తవం. హెయిర్ స్టైల్స్ విషయంలో రకరకాల టెక్నాలజీలు, ఇంప్లాంటేషన్ లు అందుబాటులో ఉండటంతో? సొంత హెయిర్ లేకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీ ఓ హెయిర్ స్టైల్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని ఫాలో అయితే చాలు. హీరో ఇమేజ్ దానంతటదే వస్తుంది.
తాజాగా పాత రోజుల్లో నటుడికి హెయిర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అన్నది బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా మాటల్లో తెలుసుకుందాం. హెయిర్ కోసం అప్పట్లో ఆయన ఎంత మదన పడేవారో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ` చిన్న వయసులోనే వెంట్రుకలు ఊడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. నాకది చాలా పెద్ద సమస్యగానే అనిపించేది.
19 ఏళ్ల వయసులో జుట్టు ఊడిపోతే భరించలేకపోయేవాడిని. అది మానసికంగా , వృత్తిపరంగా చాలా ఇబ్బంది పెట్టింది. నటుడిగా కొనసాగాలంటే జుట్టు చాలా కీలకం. తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? అన్న దాన్ని బట్టే సినిమా అవకాశాలు వచ్చేవి. కారణం ఏదైనా జుట్టు రాలడాన్ని ఎవరూ ఆపలేం. నిజాన్ని జీర్ణించుకునే వరకూ ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ పరంగా రకరకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో కాస్త ఉపశమనం దక్కుతుంది. అప్పటి రోజుల్లో జుట్టు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అని తీసి పారేసేవారు` అని అన్నారు. అక్షయ్ ఖన్నా ఇటీవల రిలీజ్ అయిన `ఛావా` సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. హీరో పాత్రకు ఎంత పేరొచ్చిందో? అక్షయ్ ఖన్నా పాత్రకు అంతే పేరొచ్చింది.