RRR సీతకు అంతర్జాతీయంగా పెరిగిన ఇమేజ్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి అంతర్జాతీయంగా సినిమా, ఫ్యాషన్ రంగాలలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి అంతర్జాతీయంగా సినిమా, ఫ్యాషన్ రంగాలలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. దశాబ్ధాలుగా గ్లోబల్ మార్కెట్లో బ్రాండ్ల ప్రచారంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉన్న భారతీయ నటిగా చెరగని ముద్ర వేసింది. అయితే ఐశ్వర్యారాయ్ ఏజ్ పెరుగుతున్న క్రమంలో తనకు వారసురాలిగా మళ్లీ ఆ స్థాయిని అందుకునే సమర్థత ఎవరికి ఉంది? అంటే.. కచ్ఛితంగా దానికి సమాధానం లభించింది. గ్లోబల్ మార్కెట్లో ఐష్ తర్వాత ఆలియా భట్ కి క్రేజ్ ఉందని ఇప్పుడు నిరూపణ అయింది.
ఇంతకుముందు ప్రఖ్యాత లోరియల్ ప్యారిస్ కి ఐశ్వర్యారాయ్ ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో లోరియల్ ప్యారిస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్ అబ్బురపరిచే అరంగేట్రానికి సిద్ధంగా ఉంది. ఇది మార్కెట్ వర్గాల్లో ఇప్పటికే చర్చనీయాంశమైంది. 23 సెప్టెంబర్ 2024న లి డిఫైల్ లోని ఐకానిక్ ప్లేస్ డి ఎల్ ఓపేరాలో ఆలియా కనిపించింది. లోరియల్ ప్యారిస్ బ్రాండ్ స్పష్ఠమైన లక్షణం.. మహిళ శక్తి, వైవిధ్యం, కలుపుగోలుతనం, సోదరీమణుల అత్యున్నత స్థాయి ఆకాంక్ష. అలాంటి ఐకానిక్ మూమెంట్ ఆలియా భట్‌కి దక్కనుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ ఐకాన్‌గా ఎదగడంలో కెరీర్ మైలురాయిని అధిగమించడంలో ప్రఖ్యాత బ్రాండ్ సహకరిస్తుందని విశ్లేషిస్తున్నారు.
తాజా ఈవెంట్ పేరు లి డెఫైల్ `వాక్ యువర్ వర్త్`. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఎల్లప్పుడూ ఫ్యాషన్ - అందం కలగలుపుత ప్రపంచంలో ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. అదే సమయంలో స్వీయ-విలువ మహిళల మధ్య బంధం గురించి సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. భట్ కి పెరుగుతున్న ప్రపంచ వ్యాప్త ఆదరణను..మహిళా సాధికారతపై ఆలియా నిబద్ధతను ఎలివేట్ చేయనుంది. అలియా భట్ రన్‌వే మీదుగా నడుస్తుంటే.. అది ఫ్యాషన్ అందాల సంగమంలా అందంగా ఉంటుంది. ఇది గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం గా చూడాలి.
ఈ ప్రతిష్టాత్మక షోలో ఆలియా భట్ చోటు సంపాదించడం అనేది అంతర్జాతీయ రంగంలో ఎదుగుదలకు నిదర్శనం. భారతీయ అందం -ఫ్యాషన్‌కు ప్రపంచ యవనికపై సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తున్న ఐశ్వర్య రాయ్ వరుసలో ఆలియా చేరడం ఒక అఛీవ్ మెంట్. ఐశ్వర్య రాయ్, లీలా బెక్తి, మేరీ బోచెట్, సిండి బ్రూనా, వియోలా డేవిస్, జేన్ ఫోండా, లూమా గ్రోత్, కెండల్ జెన్నర్, లియా కెబెడే, అజా నవోమి కింగ్, ఎవా లాంగోరియా, ఆండీ మెక్‌డోవెల్, బెబే వియో, యెస్సెల్ట్ వంటి అంతర్జాతీయ రాయబారులు, స్టార్లతో రన్‌వేలోకి ఆలియా భట్ చేరనుంది. ఈ తొలి అరుదైన అవకాశం ఎల్లపుడూ ప్రత్యేకమైనది అని ఆలియా ఆనందం వ్యక్తం చేసింది. అలియా భట్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అరంగేట్రం చేయడం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయ సినిమాకు ఇది గర్వకారణం. ఆస్కార్ అందుకున్న ఆర్.ఆర్.ఆర్ నటిగాను ఆలియాకు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఇమేజ్ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.