ఆల్ఫా గాళ్స్ ఏం చేయ‌బోతున్నారు?

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌నేవి చాలా అరుదు.

Update: 2024-07-06 05:47 GMT

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌నేవి చాలా అరుదు. ఏ నిర్మాణ సంస్థ‌గానీ ఆ జాన‌ర్ చిత్రాల‌కు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌దు. మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ కావ‌డంతో వాటికి పెద్ద పీట వేయదు. అందులోనూ యశ్ రాజ్ ఫిలింస్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ అయితే వాటిని ఓ వృద్ధా ప్ర‌య‌త్నంగానే చూస్తుంది. అందులోనూ లేడీస్ తో యాక్ష‌న్ చిత్రాల జోలికైతే అస‌లే వెళ్ల‌దు. అయితే అది ఇప్ప‌టి వ‌ర‌కూ వున్న మాట‌.

నేడు వైఆర్ ఎఫ్ తీరు మారింది. తొలి సారి ఆ సంస్థ లేడీ ఓరియేంటెడ్ సినిమాలు నిర్మించ‌డానికి రెడీ అయింది. దీనిలో భాగంగా మొద‌టి ప్ర‌య‌త్నంగా అలియాభ‌ట్ తో చేస్తోంది. ఆమెతో పాటు శార్వ‌రీ వాఘ్ కూడా న‌టిస్తుంది. ఇద్ద‌ర్నీ మెయిల్ లీడ్స్ కి ఎంపిక చేసి ఓ సినిమా చేస్తున్నారు. య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న తొలి మ‌హిళా ప్రాధాన్య‌మున్న యాక్ష‌న్ చిత్ర‌మిది.

సినిమా కోసం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు ప్రారంభమ‌య్యాయి.ఈ చిత్రాన్ని శివ్ రావెల్ తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ఆల్పా అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. ఈ విష‌యాన్ని అలియా భ‌ట్ చెబూతూ ఇలా రాసుకొచ్చింది. ` గ్రీకు భాష‌లో మొదటి అక్ష‌రం మానినాదం అల్పా. ఇది అత్యంత వేగ‌మైన‌ది, శ‌క్తివంత‌మైన‌ది. ప్ర‌తీ దేశం ఒక అర‌ణ్యం లాంటిదే. దాన్ని పాలించ‌డానికే వ‌స్తోంది ఆల్పాగాళ్స్` అంది.

వైఆర్ ఎఫ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌కెక్కిన స్పై సినిమాల‌కు తిరుగు లేకుండా సాగిపోయింది. అయితే అవ‌న్నీ హీరోలు న‌టించిన చిత్రాలు. ఇప్పుడు హీరోయిన్ల‌తో చేస్తోన్న స్పై సినిమా కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో అలియాతో క‌లిసి న‌టించ‌డానికి శార్వ‌రీ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. శార్వ‌రీ వాఘ్ ఇటీలే `ముంజ్యా`తో మంచి విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News