డీప్ ఫేక్ పై హీరోయిన్ ఏమంటుందంటే?
తాజాగా అలియాభట్ డీప్ ఫేక్ పై స్పందించింది. 'ఎక్కడ మంచి ఉంటుందో? అక్కడ చెడూ ఉంటుంది.
డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కొరుగా డీప్ ఫేక్ బారిన పడటంతో ఏ క్షణంలో ఏ హీరోయిన్ దొరికిపోతుందో? అర్ధం కాని సన్నివేశం ఎదురైంది. ఇప్పటికే రష్మిక మందన్న.. అలియాభట్ సహా పలువురు హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అలియాభట్ డీప్ ఫేక్ పై స్పందించింది. 'ఎక్కడ మంచి ఉంటుందో? అక్కడ చెడూ ఉంటుంది.
కానీ సమస్యని ఎదుర్కునే పరిష్కారం కూడా కనుగొనాలి. ఏఐ సాంకేతిక ఎంతో ఉపయుక్తంగా ఉంది. కొన్ని రంగాలకు.. ప్రొఫెషనల్స్ కి కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దుర్వినియోగం అవుతుంది. అలా దుర్వినియోగం అవుతుందని వెనకడుగు వేయడానికి వీలు లేదు. కొత్త కొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకోవాలి. డీప్ ఫేక్ బారి నుంచి ప్రజలను కాపాడాలే కొత్త చట్టాలు వస్తాయని ఆశిస్తున్నా' అని అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్నా కూడా డీప్ ఫేక్ పై స్పందించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా తన ముఖంతో వచ్చిన వీడియో తనని ఎంతగా బాధించిందో సోషల్ మీడియా వేదికగా వాపోయింది. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావాలని..ఇలాంటి వీడియోలు వచ్చిన ప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ అలెర్ట్ అయి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
అలాగే బిగ్ బీ అమితాబచ్చన్ కూడా రష్మిక వీడియోపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అలాంటి తప్పుడు వీడియోలు సృష్టించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని..దీనిపై సెలబ్రిటీలంతా స్పందించాలని పిలుపునిచ్చారు. ఇంకా టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది హీరోలు..హీరోయిన్లు రష్మికకు మద్దతుగా నిలిచారు. అయినా డీప్ ఫేక్ వీడియోల జోరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓవైపు సైబర్ క్రైమ్ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నా! వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీలే టార్గెట్ గా డీప్ ఫేక్ లు క్రియేట్ అవుతున్నాయి.