పుష్ప రాజ్ పర్ఫెక్ట్ సెటప్.. పీక్స్ అంతే..!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. త్రివిక్రమ్ తో దాదాపు సినిమా కన్ ఫర్మ్ అయినా అఫీషియల్ గా చెప్పాల్సి ఉంది.

Update: 2025-01-02 05:39 GMT

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. త్రివిక్రమ్ తో దాదాపు సినిమా కన్ ఫర్మ్ అయినా అఫీషియల్ గా చెప్పాల్సి ఉంది. ఐతే ఈసారి త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వెండితెర మీద ఇది వరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో ఫిల్మ్ నగర్ లో చర్చ ఒక రేంజ్ లో జరుగుతున్నా మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు.

ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమా చేయాలని అనుకున్నాడు. ఐతే ఈ సినిమా కోసం ఎలా లేదన్నా ఒక 2, 3 ఏళ్లు టైం కేటాయించాల్సి ఉంటుంది. మరోపక్క త్రివిక్రమ్ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలా అని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో దేవర డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని గట్టి టాక్ వినిపిస్తుంది.

అసలైతే దేవర ముందు అల్లు అర్జున్ తోనే సినిమా చేయాలి కానీ పుష్ప రావడం వల్ల దానికి కేటాయించాల్సి వచ్చింది. అల్లు అర్జున్ కొరటాల శివ ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కొరటాల శివ కాంబో సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ సినిమా మాత్రం వాయిదా వేసుకున్నారు. ఐతే ప్రస్తుతం కొరటాల శివ దేవర 2 పనుల్లో ఉన్నాడు. ఎన్ టీ ఆర్ టైం ఇస్తే ఆ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు వెళ్లనున్నాడు.

ఐతే ఈలోగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా పూర్తి చేస్తే నెక్స్ట్ కొరటాల శివతో లైన్ చేసేలా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాకపోయినా అటు దానికి ఇటు కొరటాల శివకు పనిచేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 హిట్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అల్లు అర్జున్ రాబోయే సినిమాలతో సౌత్ కి ఈక్వల్ గా నార్త్ సైడ్ బిజినెస్ చేస్తాడని చెప్పొచ్చు. మరి త్రివిక్రమ్ తో ఒకటి.. కొరటాల శివతో మరొకటి అల్లు అర్జున్ ప్లానింగ్ అల్లు ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News