మైనస్ 100 టు ప్లస్ 100.. ఆర్య నిలబెట్టింది..!

ఎటు పడితే అలా వెళ్తున్న ఇంజిన్ ను సరైన ట్రాక్ లో పెట్టిన సినిమా ఆర్య.. అలా పెట్టిన డైరెక్టర్ సుకుమార్.

Update: 2024-05-08 05:53 GMT

ఎటు పడితే అలా వెళ్తున్న ఇంజిన్ ను సరైన ట్రాక్ లో పెట్టిన సినిమా ఆర్య.. అలా పెట్టిన డైరెక్టర్ సుకుమార్. జీవితంలో తనపై మోస్ట్ ఇంపాక్ట్ కలిగించిన వ్యక్తి సుకుమార్. ఆయన చేసిన ఆర్య వల్ల తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని అన్నారు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో ఆర్య సినిమా విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. దిల్ స్పెషల్ షో టైం లో సుకుమార్ ని కలిస్తే ఆ నెక్స్ట్ డే కథ చెప్పారు. గంగోత్రి తర్వాత రోజుకి 2, 3 కథల దాకా విన్న తను సుకుమార్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యానని.. ఇదేదో సంథింగ్ మ్యాజిక్ చేస్తుందని నమ్మానని అన్నారు అల్లు అర్జున్.

ఇడియట్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక యూత్ సినిమా చేయాలని అనిపించింది. ఆ టైం లోనే ఆర్య కథ వచ్చింది. ఆ టైం లోనే తన ఇడియట్ ఇదే అని ఫిక్స్ అయ్యానని అన్నారు అల్లు అర్జున్. సినిమా కథ ఓకే అవ్వడం మొదలు పెట్టడం ఆ జర్నీ అంతా ఎంతో బాగా జరిగింది. అంతా కొత్త వాళ్లమే మా మీద డబ్బులు పెట్టే ధైర్యం చేశారు దిల్ రాజు.

అప్పటికి దిల్ సినిమా చేసిన రాజు గారు ఆర్య సినిమా చేయాలని అనుకున్నారు. ఆయన లేకపోతే ఆర్య ఉండదు. అందుకు దిల్ రాజు గారికి థాంక్స్ అని అన్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమాపై దేవి ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ టైం లో మా టీం లో దేవి ఒక్కడే సీనియర్. ఆనందం, వర్షం, వెంకీ ఇలా అన్నీ సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫీల్ మై లవ్ సాంగ్ వినగానే సూపర్ అనిపించింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. ఆర్ట్ కి టేస్ట్ ఉంటే చాలు డబ్బు అవసరం లేదని రత్నవేలుని చూస్తే అర్థమైంది అని అన్నారు. ఇలా ఆర్యకు పనిచేసిన వారంతా తమ బెస్ట్ ఇవ్వడం వల్లే సినిమా అంత గొప్ప విజయాన్ని అందుకుందని అన్నారు.

గంగోత్రి సినిమా బ్లాక్ బస్టర్ అయినా తను ఆడియన్స్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఆర్య ఇచ్చిన సక్సెస్ వల్ల మైనస్ 100 నుంచి ప్లస్ 100 అంటే 200 పర్సెంట్ సక్సెస్ అందుకున్నా. తన జీవితంలో అలాంటి సింగిల్ జంప్ మళ్లీ జరగదని అన్నారు అల్లు అర్జున్.

ఆర్య రిలీజ్ టైం లో నాన్న అల్లు అరవింద్ సినిమా 10 వారాలు ఆడుతుందని అన్నారు. అప్పుడు తను 125 రోజులు ఆడుతుంది. చిరంజీవి గారితో షీల్డ్ తీసుకుంటానని చెప్పా. అనుకున్నట్టుగానే సినిమా 125 రోజులు ఆడింది. ఈ సినిమాకు పనిచేసిన వారంతా ఈ సక్సెస్ కు కారణమే. ఏ ఒక్కరు లేకపోయినా ఈ సక్సెస్ ఉండేది కాదు. అయితే ఆర్య సక్సెస్ వల్ల ఎక్కువ లాభ పడ్డది తనే అని అన్నారు అల్లు అర్జున్. సినిమాలో హీరోయిన్ గా నటించిన అను మెహతా కూడా తన సపోర్ట్ అందించింది. ఆమెతో పాటుగా సినిమాకు పనిచేసిన వారందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. ఆర్య టైం లో తనకు సపోర్ట్ గా నిలిచిన నన్న అల్లు అరవింద్, చిరంజీవి గారికి థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్.

ఆర్యతో మొదలై పుష్ప దాకా వచ్చింది. తను రెండు కాళ్లతో నిలబడగా ఒకటి ఆ.. రెండోది ర్య.. అని ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేసి మిమ్మల్ని అలరిస్తానని అన్నారు అల్లు అర్జున్.

Tags:    

Similar News