అల్లు vs జనసేన క్లాష్.. చిటికెలో అయిపోయేదానికి..

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కూటమి విజయానికి పవన్ పాత్ర కీలకమని స్వయంగా ఒప్పుకున్నారు.

Update: 2024-06-13 08:20 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించడం ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని 'తుఫాన్' అని అభివర్ణించడం కూడా పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తెలియజేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కూటమి విజయానికి పవన్ పాత్ర కీలకమని స్వయంగా ఒప్పుకున్నారు.

వైసీపీ నాయకులు కూడా తమ ఓటమికి పవన్ కళ్యాణ్ కీలక కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ ఇంట్లో పవన్ విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొని పవన్ కళ్యాణ్ ని అభినందించారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలను తాకి నమస్కరించడం, కుటుంబసభ్యులంతా కలిసి వేడుక జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసి అభిమానులు భావోద్వేగంతో స్పందించారు.

అయితే అల్లు ఫ్యామిలీ సభ్యులు ఈ వేడుకలో హాజరు కాకపోవడం. బావగారు అల్లు అరవింద్ సహా, అల్లు శిరీష్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఇటువంటి సందర్భంలో వారి గైర్హాజరు వివిధరకాల చర్చలకు కారణమైంది. దానికి తోడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేయడం మరింత అగ్గి రాజేసింది.

అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తన వైసీపీ ఫ్రెండ్ శిల్పా రవికిశోర్ చంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లడం, ఆయన వైసీపీ నేతలతో కలవడం జనసైనికులను అసహనానికి గురిచేసింది. ఈ విషయంలో అల్లు అర్జున్ తరువాత క్లారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ కి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పుడు సడన్ గా సాయి ధరమ్ తేజ్ కూడా బన్నీని దూరం చేసినట్లు కనిపిస్తూ ఉండడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో ఏదో జరిగింది అన్నట్లు ఫ్యాన్స్ లో గొడవలు మొదలయ్యాయి. బన్నీ పుష్ప 2ని చూడబోము అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయినా బన్నీ చిటికెలో ఈ రచ్చకు ముగింపు కార్డు వేయవచ్చు, కానీ ఎందుకు అలా చేయడంలేదో ఎవరికి అర్థం కావడం లేదు. నార్మల్ పండగ టైమ్ లో శుభకార్యాల సమయంలో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో పాల్గొనే బన్నీ ఇప్పటివరకు జనసేన విజయ సంబరంలో కనిపించలేదు. ఒక్కసారి పవన్ ను కలిసి ఒక బొకే ఇచ్చి ఫొటో వదిలితే ఉన్న నెగిటివిటి మొత్తం చిటికెలో ఎగిరిపోతుంది. కానీ బన్నీ బిజీగా ఉన్నాడో లేదంటే జనసేనాని కలవడానికి టైమ్ తీసికుంటున్నాడా అనేది తెలియకుండా ఉంది.

ఇప్పటివరకు అల్లు అరవింద్ కూడా జనసేన అధినేతతో కనిపించలేదు. శిరీష్ కూడా లేడు. ఇవన్నీటికీ తోడు సాయి ధరమ్ తేజ్ బన్నీని దూరం పెట్టినట్లు కనిపించడం.. ఇలాంటి పరిణామాలకు ఫ్యాన్స్ లో రచ్చ జరగడం కామన్. ఇప్పటివరకు చిన్న రియాక్షన్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News