చిన్న నటి.. ఇది కదా గ్రేట్ నెస్ అంటే..!
పలువురు అగ్ర నాయికలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా కానీ, ఇప్పటి సందర్భానికి తగ్గట్టు స్పందించి ఉంటే బావుండేదని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అవును.. ఇది కదా గ్రేట్ నెస్ అంటే..! చిన్న హీరోయిన్ పెద్ద మనసు అందరినీ కదిలించింది.. సదరు నటి ఆదర్శం మరిపిస్తోంది..! తన నుంచి వచ్చిన ఈ ప్రకటన నిజంగా ఆలోచింపజేసేది. పెద్ద స్టార్లు కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్న అగ్ర కథానాయికలు ఇంతవరకూ ఒక్కరు కూడా ఏపీ-తెలంగాణలో వరద ముప్పు ఎదుర్కొన్న సాధారణ ప్రజలకు సాయం ప్రకటించలేదు. ఎవరో వేళ్ల మీద లెక్కించదగినంత మంది సెలబ్రిటీలు మాత్రమే సాయం ప్రకటించారు. పలువురు అగ్ర నాయికలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా కానీ, ఇప్పటి సందర్భానికి తగ్గట్టు స్పందించి ఉంటే బావుండేదని ఫ్యాన్స్ కోరుతున్నారు.
చిన్న సినిమాలతో పాటు పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`లో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల స్పందన ఇప్పుడు అందరికీ స్ఫూర్తి నింపుతోంది. అనన్య ఇప్పుడు తెలుగు ప్రజల కష్టాలను చూస్తూ వదిలేయలేదు. నేనున్నాను! అంటూ ముందుకు వచ్చి ఏకంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అనన్య ప్రకటన ఇలా ఉంది. ``రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 2.5 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నాను`` అని అన్నారు.
చిన్న నటి తానవంతు సాయంతో పెద్ద మనసు చాటుకుంది. మిగత పెద్ద నటీమణులు, నాన్ లోకల్ హీరోయిన్స్ కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్స్ ఇలాంటి సమయంలో సాయానికి ముందుకొస్తే బాగుంటుంది! అని సోషల్ మీడియాలో చర్చ వేడెక్కిస్తోంది. ఇక మన అగ్ర కథానాయికలు స్వచ్ఛంద కార్యక్రమాలతో చాలామందిని ఆదుకుంటున్నారన్నది ఈ సందర్భంగా మరువరాదు. సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క, త్రిష సహా పలువురు అగ్ర నాయికలు ఇప్పటికే సేవాకార్యక్రమాల్లో ఉన్నారు. ఆర్థిక విరాళాలు అందిస్తున్నారు. అయితే ఇప్పటి సందర్భాన్ని బట్టి తెలుగు ప్రజలను కష్టంలో ఆదుకుంటే బావుంటుందనేది అభిమానుల అభిప్రాయం.