'యానిమల్​'.. పెద్ద రిస్కే

ఇటీవలే యానిమల్ మూవీటీమ్​ ఇండిపెండెన్స్​ను డే రిలీజ్​ అవ్వాల్సిన సినిమాను పోస్ట్ పోన్​ చేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది

Update: 2023-07-27 07:15 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'యానిమల్‌'. అర్జున్​రెడ్డి, కబీర్​ సింగ్ వంటి గ్రాండ్ హిట్స్​ తర్వాత సందీప్​ వంగా దర్శకత్వంలో రానున్న చిత్రమిది. అలాగే బ్రహ్మాస్త్ర వంటి భారీ హిట్​ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఇది రానుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంది. అయితే ఈ చిత్రం ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అంతా అంటున్నారు. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గితే బాగుంటుందని చెబుతున్నారు.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవలే యానిమల్ మూవీటీమ్​ ఇండిపెండెన్స్​ను డే రిలీజ్​ అవ్వాల్సిన సినిమాను పోస్ట్ పోన్​ చేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్​కు వాయిదా వేస్తూ ఓ వీడియోను షేర్​ చేసింది. అయితే ఇండియన్ బాక్సాఫీస్​కు ఇండిపెండెన్స్​ డే రిలీజ్ సినిమాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఆ రోజు పబ్లిక్​ హాలీడే అవ్వడం వల్ల సినిమాలకు వెళ్లడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

మరి అలాంటి తేదీ నుంచి పక్కకు తప్పుకోవడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున బాలీవుడ్​లో మరో రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అవే సీనియర్ హీరోలు సన్నీడియోల్​ నటించిన 'గద్దర్​ 2', అక్షయ్​ కుమార్​ 'ఓమైగాడ్​ 2'. ఈ రెండు చిత్రాలు సీక్వెల్స్​ కావడం మరో విశేషం. ఈ సినిమాల మొదటి భాగాలు అప్పట్లో భారీ సక్సెస్​లను అందుకున్నాయి. కానీ ఇప్పుడా హైప్​.. సీక్వెల్స్​లో కనపడం లేదు.

తాజాగా 'గద్దర్​ 2' ట్రైలర్ విడుదలైంది. కానీ అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మిక్స్​డ్​ రివ్యూస్ వచ్చాయి. అలాగే 'ఓమైగాడ్​ 2' చిత్ర కథ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ సెన్సార్​ సమస్యలను ఎదుర్కొంటోంది.

మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్​ను కూడా మొదలుపెట్టలేదు. ఒకవేళ ఈ చిత్రం మరో రెండు మూడు రోజుల్లో సెన్సార్​ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే..సినిమా పోస్ట్​ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ రిలీజైన డౌటే.

అంటే ఇండిపెండెన్స్​కు వచ్చే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇలాంటి సమయంలో సందీప్ వంగా యానిమల్​ ఆ రోజున విడుదలైతే.. మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది. అలానే కంటెంట్​ మరింత బాగుంటే.. మంచి లాభాలు అందుకునేలా వసూళ్లు కూడా వస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో యానిమల్​ టీమ్​కు వెనక్కి తగ్గటం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. మూవీటీమ్ రిలీజ్​ విషయంలో పెద్ద తప్పు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. వీలైతే తమ నిర్ణయం మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News