రష్మిక - రణ్‌బీర్.. ఫస్ట్ నైట్ విత్ వైలెన్స్ ఎపిసోడ్
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. రణ్‌బీర్ కపూర్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. రణ్‌బీర్ కపూర్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం.. వైల్డ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. రీసెంట్గా రిలీజైన ఈ మూవీ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రణ్‌బీర్ కిల్లింగ్ వైల్డ్ క్యారెక్టర్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి గుస్ బంప్స్ తెప్పించేలా మరో వార్త బయటకు వచ్చింది.
వివరాళ్లోకి వెళ్లితే.. ఈ సినిమాను దర్శకుడు సందీప్ వంగా ఎంతో గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఇంటెన్సివ్‌గా తెరకెక్కించినట్లుగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో రణ్‌బీర్ - రష్మిక పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా కూడా కనిపించనున్నారు.
అయితే వీరిద్దరి మధ్య ఓ సన్నివేశాన్ని సందీప్ వంగా హైరేంజ్లో తెరకెక్కించారట. అదేంటంటే.. సినిమాలో వీరిద్దరికి పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందట. వైట్ ధోతి - వైట్ శారీ లుక్‌లో ఇద్దరు కనిపిస్తారట. అయితే అదే సమయంలో విలన్ గ్యాంగ్స్ ఈ జంటపై దాడికి పాల్పడతారట. ఆ సమయంలో రణ్‌బీర్ ఎంతో వైల్డ్‌గా మారిపోయి.. ప్రతినాయకుల గ్యాంగ్‌పై విరుచుకుపడతారట.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓ వైపు రష్మికతో ఫస్ట్ నైట్ రొమాన్స్ చేస్తూనే ఈ ఫైటింగ్ సీన్ చేస్తారట రణ్‌బీర్. అలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారని తెలిసింది. ఈ వైలెన్స్ - రొమాన్స్ ఎపిసోడ్ రెండిటీనీ సందీప్ వంగా అద్భుతంగా చిత్రీకరించారట. ఔట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని తెలిసింది. సినిమాకు ఇది స్పెషల్ అట్రాక్షన్‌గా హైలైట్‌గా నిలవనుందని చెబుతున్నారు.
కాగా, సినిమాలో బాబీ దేవోల్, అనిల్ కపూర్ లాంటి క్రేజీ స్టార్స్ కూడా నటించడంతో.. ఈ చిత్రంపై మొదట్నుంచీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రచార చిత్రంలో రణ్‌బీర్ కపూర్ మాస్ అవతారం చూశాక.. అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతానీ, అశ్విన్ వర్దే, ప్రణయ్‌రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.