'సలార్' కాదు 'యానిమల్' ఫెస్టివల్ మొదలు
ఆర్కే పుట్టినరోజున విడుదల చేయాలనేది ప్లాన్. ఒక టిఫికల్ కట్ ఇప్పటికే లాక్ అయింది.
పఠాన్ - జవాన్ చిత్రాలతో కింగ్ ఖాన్ షారూఖ్ బాక్సాఫీస్ వద్ద తానే బాద్ షా అని నిరూపించాడు. హిందీ సినిమా గ్రేట్ కంబ్యాక్ కోసం అతడు చేసిన కృషికి ప్రశంసలు కురుస్తున్నాయి. పనిలో పనిగా గదర్ 2తో సీనియర్ నటుడు సన్నీడియోల్ ఘనమైన కంబ్యాక్ సాధ్యపడింది. మరోవైపు తమిళ చిత్రం జైలర్ హవా దేశవ్యాప్తంగా సాగింది. జవాన్ - జైలర్ పాన్ ఇండియా హిట్లుగా నిలిచాయి. రజనీకాంత్ కి జైలర్ ఒక అసాధారణమైన మైలురాయిగా నిలిచింది.
ఇకపై రాబోతున్న సినిమాల్లో 'టైగర్ 3' రికార్డులు తిరగరాసేందుకు అవకాశం ఉన్న సినిమా. ఇది సల్మాన్ కెరీర్ బెస్ట్ అవుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. ఆ తర్వాత ప్రభాస్ - కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ సలార్ పై భారీ అంచనాలున్నాయి.అయితే సలార్ రిలీజ్ తేదీ ఎప్పుడు? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది. వీటితో పాటు ఇంకా ఏవైనా మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉన్నాయా? అన్నది ఆరా తీస్తే .. ఈ ఏడాది రాబోతున్న వాటిలో తెలుగు దర్శకుడు సందీప్ వంగా రూపొందిస్తున్న 'యానిమల్' కూడా జాబితాలో ఉంది.
అయితే చాలా కాలంగా రణబీర్ కపూర్ నటించిన యానిమల్ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. దానికి చిత్రబృందం నుంచి సరైన సమాధానం లేదు. ఎట్టకేలకు తాజా నివేదిక ప్రకారం.. రణబీర్ కపూర్ పుట్టినరోజున 2 నెలల పాటు సాగే ప్రమోషనల్ క్యాంపెయిన్ షెడ్యూల్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఇది రణబీర్ కి పాన్ ఇండియా హిట్టుగా నిలుస్తుందనే హోప్ ఉంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ ని బెస్ట్ ఔట్ పుట్ తో తీర్చిదిద్దుతున్నారని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. ఇక టీజర్ లో ఉత్తమ ఔట్ పుట్ కోసం శ్రద్ధగా పని చేస్తున్నాడని ఒక క్లోజ్ సోర్స్ తెలిపింది. టీజర్‌కు సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆర్కే పుట్టినరోజున విడుదల చేయాలనేది ప్లాన్. ఒక టిఫికల్ కట్ ఇప్పటికే లాక్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది అంకంలో ఉన్నాయి. టీజర్ ఖరారైతే రిలీజ్ తేదీపై అధికారికంగా వివరాలు వెల్లడిస్తారు. అభిమానులు రణబీర్ స్పెషల్ డే కి ఎపిక్ టీజర్‌ను ఆశించవచ్చు అని గుసగుస వినిపిస్తోంది. అయితే ఈ ప్లాన్ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే ఇది పోస్ట్-ప్రొడక్షన్ బృందం నుండి సకాలంలో డెలివరీపై ఆధారపడి ఉంటుంది. టీజర్ కాకపోతే పోస్టర్, మోషన్ పోస్టర్ లేదా ఊహించనిది ఇంకేదైనా అభిమానుల కోసం అందిస్తారా? అన్నది వేచి చూడాలి.
జూన్‌లో యానిమల్ ప్రీ-టీజర్‌తో ఆకట్టుకున్న సందీప్ వంగా ఈ సినిమాపై అంచనాలను పెంచగలిగాడు. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ టీజర్ తో ఈ అంచనాలు ఆకాశాన్ని అంటుతాయని కూడా చర్చ సాగుతోంది. రణబీర్ కపూర్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రదర్శించడమే సందీప్ వంగా లక్ష్యం. ఎవరూ ఊహించని అతీతమైన మానసిక కోణాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాని చిత్రీకరించాడని సోర్సెస్ చెబుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో దానిని అందిస్తారని టాక్ వినిపిస్తోంది. టీజర్ తో దీనిపై పూర్తి స్పష్ఠత రానుంది. సలార్ రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు కనుక ఇప్పటికి యానిమల్ రేసులో ముందుకు వచ్చినట్టు. ఒకవేళ నవంబర్ రిలీజ్ ని ప్రకటిస్తే సలార్ ముందుకు దూసుకువస్తుంది. సలార్ ప్రమోషన్స్ పరంగా వేగం పుంజుకుంటుంది.